Monday, December 23, 2024

తెలంగాణ వ్యవసాయ పథకాలు భేష్

- Advertisement -
- Advertisement -

CM KCR gave priority to irrigation: National Farmers Associations

సిఎం కెసిఆర్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చారు, కాళేశ్వరం అద్భుతం :
జాతీయ రైతు సంఘాల నేతలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి పథకాలు రైతులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని జాతీయ రైతు సంఘాల నేతలు వెల్లడించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో కూడిన జాతీయ రైతుసంఘాల సమాఖ్య సోమవారం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించింది. కాళేశ్వరం, మేడిగడ్డ, రంగనాయక సాగర్ , మిడ్ మానేరు, కొడపోచమ్మ సాగర్ తదితర ప్రాజెక్టులను సందర్శించింది. వివిధ గ్రామాల రైతులను కలిసి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న పథకాల తీరును ఆరా తీసింది. అనంతరం మంగళవారం నాడు రైతుబంధు సమితి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించింది.ఈ సందర్బంగా జాతీయ రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు దేవశిఖామణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ విధానాలు తమను ఎంతగానో అకట్టు కున్నాయన్నారు.సిఎం కేసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం వ్యవసాయ రంగానికి పెద్ద చోదకశక్తిగా ఉందన్నారు.ఏటా రెండు విడుతలుగా ప్రతి ఎకరానికి రూ.10వేలు పెట్టుబడి సాయం అందిస్తుండం తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలో తాము వినలేదన్నారు.

అంతే కాకుండా రైతుబీమా పధకం కూడా రైతుల కుటుంబాలకు ఎంతో ధైర్యాన్నిస్తోందని తెలిపారు. నకిలీ విత్తనాలు అరికట్టి రైతులకు ప్రభుత్వం ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ఇటు వంటి విధానాలు జాతీయ స్థాయిలో అమలు చేస్తే వ్యవసాయం మరింతగా అభివృద్ది చెందుతుందన్నారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తీరు అద్బుతంగా ఉందని హర్యానా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షులు సేవాసింగ్ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ రైతుసమాఖ్య అధ్యక్షుడు శాంతకుమార్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ స్వల్పకాలంలోనే వ్యవసాయ రంగంలో ఎంతో పురోభివృద్ధిని సాధించిందన్నారు. పంటల ఉత్పదాకతలో జాతీయ స్థాయిలో ఎంతో ముందుందున్నారు. ఈ సమావేశంలో గుల్బర్గాకు చెందిన రైతు నాయకులు రమేశ్ , ధర్మారాజు, ఎపి నాయకులు వి.రాంబాబు, తమిళనాడుకు చెందిన రామ్‌గౌడ, తెలంగాణ రాష్ట్ర పసుపు రైతు సంఘం అధ్యక్షుడు నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News