Thursday, January 23, 2025

గిరిజన తండాలకు గుర్తింపు ఇచ్చింది సీఎం కెసిఆరే

- Advertisement -
- Advertisement -

మంథని రూరల్: కాంగ్రెస్ పార్టీలో ఉన్న అయ్యా కొడుకులు 40 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారో తెలుపాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. గిరిజన తండాలకు గుర్తింపు తెచ్చింది సీఎం కెసిఆరే అని పేర్కొన్నారు. శనివారం మండలంలోని మండలంలోని బట్టుపల్లి గ్రా మంలో గిరిజన దినోత్సవంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బట్టుపల్లి వాసుల చిరకాల కోరిక మర్రివాగు ప్రాజెక్టు నిర్మాణం విషయంలో దుద్దిళ్ల కుటుంబం నిర్లక్షం చేసిందని అన్నారు. ఇ క్కడి వారిని ఓట్లకోసమే వాడుకున్నారని ఎద్దేవా చేశారు. మర్రివాగు ప్రాజెక్టు తామే తెచ్చామని గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే ప్రాజెక్టు నిర్మా ణానికి ఫారెస్ట్ నుంచి క్లియరెన్స్ ఎందుకు తీసుకురాలేదని అడిగారు.

ఇక్కడి ప్రాజెక్టుకు ధర్మపురిలో భూమిని చూపించిన గొప్ప నాయ కుడని విమర్శించారు. నాలుగేళ్లలో బట్టుపల్లి గ్రామానికి 30 లక్షల అభివృద్ది నిధులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రం వచ్చాక గిరిజన తండా లను పంచాయతీలుగా గుర్తించి, వారికి సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు.

గిరిజన దినోత్సవం సందర్భంగా గ్రామానికి వచ్చిన జడ్పీ చైర్మన్ పుట్ట మదుకర్, అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్‌లకు గ్రామస్తులు ఘన స్వా గతం పలికారు. అనంతరం గ్రామంలో రూ.10 లక్షల జడ్పీ నిధులతో చేపట్టిన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అంగ న్‌వాడీ కేంద్రంలోని చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. అనంతరం గిరిజన పూజారులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్ర మంలో జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్, ఎంపీపీ శంకర్, సర్పంచ్ లక్ష్మణ్‌లతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News