Monday, December 23, 2024

ఆసరాతో సామాజిక రక్షణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ.. వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోంది. ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో పేదరిక నిర్మూలనతో పాటు ఆర్ధిక, అభివృద్ధి వేగవంతం కావడానికి.. సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి విశేషంగా కృషి చేస్తుంది. తద్వారా పేద, బడుగు, బలహీన -వర్గాల ప్రజలకు సామాజిక రక్షణ కల్పిస్తుంది. తెలంగాణలో దివ్యాంగులకు అందిస్తున్న ప్రోత్సాహం.. ఆర్థిక సాయం తీరుగానే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తే బాగుంటుందని జాతీయ స్థాయిలో దివ్యాంగుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేలా ముఖ్యమంత్రి కెసిఆర్ సమాయత్తం కావడంపై వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానని సిఎం కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ పథకాలపై దేశంలోని వివిధ ప్రాంతాల వాసులు, రాజకీయ నాయకులు ఆరా తీస్తున్నారు.
పెరిగిన వృద్ధుల జనాభా
స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 11 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు. 2031 సం. నాటికి రాష్ట్ర జనాభాలో 14.5 శాతం మంది వృద్ధుల కేటగిరీలో ఉంటారని అంచనా. అందుకే, రాష్ట్రంలో వృద్దాప్య జనాభాకు అవసరమైన విధానాలు, కార్యక్రమాలపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. వృద్ధుల సంబంధిత అవసరాలను తీర్చాలనే ఉద్దేశ్యంతో, రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం కాల్ సెంటర్, -హెల్ప్ లైన్ (-14567) ని ఏర్పాటు చేసింది. కేంద్రం నిర్వహించిన ‘భారతదేశంలో వికలాంగులు’ 2018 సర్వే ప్రకారం.. తెలంగాణ జనాభాలో దివ్యాంగులు దాదాపు 2 శాతం ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది లోకోమోటర్ వైకల్యంతో బాధపడుతున్నారు (వికలాంగుల జనాభాలో 65 శాతం). దివ్యాంగుల జనాభాలో అక్షరాస్యత రేటు 40.7 శాతం. వీరి జనాభాకు సంక్షేమాన్ని విస్తరింపజేయడం అనేది.. దివ్యాంగుల జీవన గౌరవానికి చాలా కీలకమైనది.
దివ్యాంగులకు ప్రత్యేక విద్యాలయాలు
151 మంది దివ్యాంగులకు అయిదు గురుకుల విద్యాలయాలు, దృష్టి లోపం ఉన్నవారి కోసం రెండు పాఠశాలలు, వినికిడి లోపం ఉన్నవారికి మూడు పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు మొత్తం 830 మంది విద్యార్ధులు, 25 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అర్హత కలిగిన దివ్యాంగుల (పిడబ్లూడిఎస్) కోసం పాలన సౌలభ్యం, ప్రత్యేక పథకాల అమలును ప్రోత్సహించడానికి ప్రత్యేక వికలాంగుల కార్డులు (యుడిఐడి) పథకం ప్రారంభించారు. తెలంగాణలో 4.76 లక్షలకు పైగా కార్డులు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది దివ్యాంగుల లబ్ధిదారులు నెలకు రూ. 3,016 ఆసరా పింఛన్లు పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో దివ్యాంగుల అభ్యర్థులకు 4 శాతం రిజర్వేషన్లతో పాటు, అన్ని పేదరిక నిర్మూలన కార్యక్రమాలలో దివ్యాంగులకు రిజర్వేషన్లు 3 శాతం నుంచి 5 శాతానికి పెంచారు. వికలాంగుల శాఖ దివ్యాంగులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు కోసం టోల్- ఫ్రీ ‘హెల్ప్ లైన్ నంబర్ 1800-572-8980’ని ఏర్పాటు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News