Monday, December 23, 2024

బాలికల విద్యకు సిఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

మక్తల్ : పట్ట ణ సమీపంలో ని సంగంబండ రోడ్డులో గల కె జిబివి వద్ద ప్ర హారీ నిర్మాణం తో అందులో వి ద్యనభ్యసిస్తోన్న బాలికలకు భద్రతతో పాటు భరోసా లభిస్తున్నదని మక్తల్ ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. కెజిబివి వద్ద రూ.15లక్షల వ్యయ ంతో నిర్మించనున్న ప్రహారీ నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమిపూజను చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల విద్యకు సిఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నారన్నారు. మండలానికో కెజిబివితో పాటు నియోజకవర్గంలో 6 గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య, వసతిని కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పావని, ఏ ఈ నాగశివ, కెజిబివి ఎస్‌ఓ రాధిక, బిఆర్‌ఎస్ నాయకులు కె.గోవర్ధన్‌రెడ్డి, గ వినోళ్ల నర్సింహారెడ్డి, నేతాజీరెడ్డి, ఈశ్వర్‌యాద్, జుట్ల సాగర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News