Saturday, November 16, 2024

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే సిఎం కెసిఆర్ లక్ష్యం

- Advertisement -
- Advertisement -
CM KCR Goal To Provide Free Medical Treatment For Poor
ఏప్రిల్ నాటికి 7 మొదటి సంవత్సరం మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి, జూన్ నాటికి రామగుండం మెడికల్ కాలేజి అందుబాటులోకి-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న ఎనిమిది మెడికల్ కాలేజీల మొదటి సంవత్సరం నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు గురువారం మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కొత్తగా 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఎన్ ఎం సి నిబంధనల మేరకు నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించారు.ప్రస్తుత నిర్మాణ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నిర్మాణ పనులు పూర్తి నాణ్యతతో నిర్దేశిత సమయంలో పూర్తి కావాలన్నారు. మంచిర్యాల,జగిత్యాల, వనపర్తి,నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భ‌ద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మొదటి సంవత్సరం మెడికల్ కాలేజీలు ఏప్రిల్ లో పూర్తవుతాయన్నారు. రామగుండం ఫస్ట్ ఇయర్ మెడికల్ కాలేజి నిర్మాణం ఈఏడాది జూన్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. పర్ట్ చార్ట్ ప్రకారం పనులు జరగాలని పురోగతిని రోజు వారిగా సమీక్షించాలని,భవన నిర్మాణాలు పూర్తయిన చోట మొదటి సంవత్సరం మెడికల్ కాలేజీ నిర్వహణకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం టిఎస్‌ఎమ్‌డిసి వారితో సమన్వయం(కోఆర్డినెట్) చేసుకోవాలని ఈఎన్సీ గణపతి రెడ్డిని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బి కార్యదర్శి శ్రీనివాసరాజు,ఈఎన్సీ గణపతి రెడ్డి, సి.ఈ సతీష్,మంత్రి పి.ఎస్ ముకుంద్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News