- Advertisement -
హాలియా: నల్లగొండ జిల్లా గ్రామ పంచాయతీలకు సిఎం కెసిఆర్ శుభవార్త చెప్పారు. నల్లగొండ జిల్లాలోని హాలియాలో టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బహిరంగ సభకు టిఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సభకు ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. బహిరంగ సంభలో సిఎం మాట్లాడుతూ… నల్లగొండ జిల్లాలోని సర్పంచ్ లు బాగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీకి రూ.20 లక్షలు, మండల కేంద్రానికి రూ.30లక్షలు మంజూరు చేస్తున్నట్టు సిఎం చెప్పారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5కోట్లు, మిగితా మున్సిపాలిటీలకు రూ. కోటి చొప్పున ఇస్తామని సిఎం పేర్కొన్నారు.
CM KCR good news for Nalgonda Gram Panchayats
- Advertisement -