Wednesday, January 22, 2025

తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి సిఎం కెసిఆర్ గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడినప్పుడు అగమ్యఘోచర పరిస్థితులు ఉండేవని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరెంట్, నీటి సౌకర్యాలు ఉండేవి కావన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పని వాటిని, ఎన్నికల ప్రణాళికలో లేని వాటిని కూడా అమలు చేశాం అన్నారు. కల్యాణలక్ష్మి పథకం ఎవరూ అడగకపోయినా అమలు చేశాం. ఎన్నికల ప్రణాళికలో లేనివాటినీ అమలు చేసిన ఘనత మాదే అని సిఎం పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దళితబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేని కెసిఆర్ పేర్కొన్నారు. దళితబంధును కొనసాగిస్తామని ఆయన సూచించారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. గిరిజనులకు ఇచ్చిన అన్ని హామీలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. భవిష్యత్ లోనూ గిరిజనులక మరిన్ని పథకాలు తెస్తామని వెల్లడించారు. లంబాడీ తండాలు, గోండు గూడెలను పంచాయతీలు చేస్తామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు క్లిష్ట పరిస్థితులుండేవి. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని సిఎం కెసిఆర్ తెలిపారు.

తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. బిసిల్లో వృత్తి పనులు చేసుకునే వర్గాలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం. ఏటా 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నాం. వ్యవసాయరంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుందన్నారు. తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా పథకాలు తెచ్చాం. బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కెసిఆర్ బీమా చేయిస్తామని సిఎం స్పష్టం చేశారు. 93 లక్షల కుటంబాలకు కెసిఆర్ బీమా ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News