Monday, December 23, 2024

సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ చిత్రపటాలకు క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

బిక్కనూర్: మండల కేంద్రంలో బుధవారం సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ ఎస్సి సెల్ పట్టణ అద్యక్షుడు డప్పు రవి మాట్లాడుతూ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి కొచ్చెరువు కట్టపై నుండి పాత హరిజనవాడకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.కోటి 5 లక్షల రూపాయల నిధులు కేటాయించి హరిజనవాడ కాలనీవాసుల చిరకాల కలను నెరవేర్చిన ప్రభుత్వ విప్ గంపగోవర్దన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిద్దిరామేశ్వర్ టెంపుల్ డైరెక్టర్ తాటికొండ బాబు, ఎంపిటిసీ ఉప్పల బాబు, నర్ముల రామచంద్రం, నర్సింగారావు, వార్డు సభ్యురాలు కర్రోల్ల సుజాత, వార్డు మెంబర్ సత్తూరి బాలరాజు, తికొండ రమేష్, స్వామి, సురేష్, రమేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News