Friday, January 10, 2025

అఖిలేశ్ యాదవ్‌కు సిఎం కెసిఆర్ సాదర స్వాగతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సాదర స్వాగతం పలికారు. దేశ రాజకీయాలపై సిఎం కెసిఆర్‌తో చర్చించేందుకు అఖిలేశ్ సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని అఖిలేశ్‌కు స్వాగతం పలికారు.

అక్కడి నుంచి ప్రగతి భవన్ కు చేరుకున్న అఖిలేశ్‌కు సిఎం కెసిఆర్ సాదరంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. ప్రగతి భవన్‌లో అఖిలేశ్, సిఎం కెసిఆర్ లంచ్ అనంతరం సమావేశం కానున్నారు. కాగా, కాంగ్రెస్ తో కూడిన ప్రతిపక్షంలో ఉన్న అఖిలేశ్, కెసిఆర్‌తో భేటి కావడంతో ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News