- Advertisement -
ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులూ
పెన్షన్ కావాలంటున్నారు, కొందరు
ప్రబుద్ధులు పెద్దమొత్తంలో జీతాలు
తీసుకుంటూ అమ్మానాన్నలకు సరిగా
తిండి పెట్టడం లేదు : సిఎం కెసిఆర్
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు సైతం తమకు పెన్షన్ కావాలని అడుగుతున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. అంటే ప్రభుత్వంలో కొలువులు చేస్తూ కూడా పెద్దమొత్తంలో జీతాలను తీసుకుంటూ కొద్దరు ప్రబద్దులు తల్లిదండ్రులకు సరిగా తిండి పెట్టడం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డికి గులాబీ కండు వా వేసిన సందర్భంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్ అన్నారు. తల్లిదండ్రులను చూడని వ్యక్తులు దేశాన్ని అభివృద్ధి చేస్తారా?అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏదైనా కొనొచ్చు కానీ తల్లిదండ్రులను కొనలేమన్నారు. ఎంత చేసినా వారి రుణం తీర్చుకోలేనిదన్నారు.
- Advertisement -