Monday, December 23, 2024

రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Greetings people on Sankranti

ప్రజలు సిరి సంపదలు, భోగ భాగ్యాలతో తులతూగాలి
మకర సంక్రాంతిని పచ్చదనం నడుమ ఆనందంగా జరుపుకోవాలి
రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి సంపదలతో భోగ భాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని సిఎం కెసిఆర్ అన్నారు. పంటపెట్టుబడి సాయం పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్రంలో వ్యవసాయం అనుబంధ రంగాలలో పండుగ వాతావరణం నెలకొల్పామన్నారు. తెలంగాణ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఎన్ని కష్టాలెదురైనా సమర్థవంతంగా ఎదుర్కుంటామన్నారు. రైతుల జీవితాల్లో నిత్య సంక్రాంతులను కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి పండుగను పచ్చదనం నడుమ ఆనందంగా జరుపుకోవాలని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సిఎం కెసిఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News