Tuesday, December 24, 2024

రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ బోనాల పండుగ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గోల్కొండ ఆషాడ బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నదని, తద్వారా తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతికి పెద్దపీట వేసిందని సిఎం అన్నారు. డప్పులు, మేళ తాళాల నడుమ మహిళలు బోనమెత్తుకోని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తారని సిఎం తెలిపారు.

తరతరాల తెలంగాణ సాంస్కృతిక ఆధ్యాత్మిక అస్థిత్వానికి బోనాల పండుగ ప్రతీకగా నిలిచిందన్నారు. బోనాల పండుగ ప్రారంభం నాడు వాన చినుకుల రూపంలో మనందరిమీద అమ్మవారు కరుణాకటాక్షాలు కురిపిస్తుండడం శుభసూచకమని సిఎం అన్నారు. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు రాష్ట్ర ప్రజలకు ఎల్లవేళలా కొనసాగుతూనే వుండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, దేశవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా దీవించాలని సిఎం కెసిఆర్ అమ్మవారిని ప్రార్థించారు.

Also Read: మర్డర్ మిస్టరీ క్రైం ఎంటర్‌టైనర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News