Thursday, January 23, 2025

సమానత్వం.. సమర్థ ప్రజాస్వామ్యంతోనే రాజ్యాంగ ఫలాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే ‘చాదర్’ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం ప్రగతి భవన్‌లో ముస్లిం మతపెద్దల సమక్షంలో దైవ ప్రార్థనలు జరిపిన అనంతరం చాదర్‌ను ఆజ్మీర్ దర్గాలో సమర్పించేందుకు సిఎం కెసిఆర్ వక్ఫ్‌బోర్డు అధికారులకు అందచేశారు. ఖాదీ బోర్డ్ చైర్మన్, మౌలానా, యూసిఫ్ జాహిద్, ముఫ్తీ- మస్తాన్ వలి, హాఫెజ్ సాబెర్ పాషా ఈ సందర్భంగా ప్రార్థనలు జరిపారు. తెలంగాణ ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్నీ ముఖ్యమంత్రిని చల్లగా చూడాలని, రాష్ట్రం మరింత ప్రగతి పథంలో సాగాలని, దేశ ప్రజలందరూ ఐకమత్యంతో జీవించేలా దీవించాలని అల్లాను వారు ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, సాంఘీక, మైనారిటీ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్థిక వైద్యశాఖల మంత్రి హరీష్‌రావు, సాంస్కృతిక పర్యాటక క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యేలు మహమ్మద్ షకీల్, గ్యాదరి కిశోర్ కుమార్, సుధీర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వక్ప్ బోర్డు చైర్మన్ మసీఉల్లాఖాన్, హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఖాజా మొజీబుద్దీన్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఆర్టీఐ కమిషనర్ మహమ్మద్ అమీర్, టీ న్యూస్ ఉర్దూ ఎడిటర్ సీనియర్ జర్నలిస్టు ఖాజా ఖయ్యూం అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News