Sunday, December 22, 2024

అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించి 51 మంది బిఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సిఎం కెసిఆర్ ఆదివారం తెలంగాణ భవన్ లో భేటీ అయ్యారు. ఇవాళ, రేపు భీఫారాలు అందిస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

బీ-ఫారాలు పొందిన అభ్యర్థుల్లో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, షకీల్, జాజాల సురేందర్, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, పట్నం నరేంద్రరెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేగా కాంత రావు, హరిప్రియా నాయక్, పువ్వాడ అజయ్, లింగాల కమల్ రాజ్, సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వర్ రావుతో పాటు పలువురు బి.ఫారాలు అందుకున్నారు. పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్లను పూరించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News