Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సిఎం కెసిఆర్ హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడి గాలి పర్యటనలు చేస్తోన్న సిఎం కెసిఆర్ బుధవారం మెదక్‌లో బీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభ ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరే సమ యంలో హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు. కాగా సిఎం చాపర్‌లో సాంకేతిక సమస్య రావడం ఇది మూడోసారి. అయితే హెలికాప్టర్‌లో టెక్నికల్ సమస్య వచ్చిందని, మరమ్మతులు కొనసాగుతున్నాయని సిబ్బంది పేర్కొన్నారు. గతంలో మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లా పర్యటనల సమయంలోనూ హెలికాప్టర్ మొరాయించించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాలను విస్తృతంగా చుట్టి వస్తున్న క్రమంలో సిఎం కెసిఆర్ హెలికాప్టర్‌కు వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తటం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News