- Advertisement -
హైదరాబాద్: సిఎం కెసిఆర్ మానవతా దృక్పథంతో అన్ని వర్గాలను అదుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బిఆర్‌కె భవన్‌లో ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సాయంపై జరిగిన మంత్రుల సమావేశం ముగిసిన అనంతరం గంగుల మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కరోనాలాంటి కష్ట కాలంలో నెలకు రెండు వేల రూపాయలు, 25 కిలోల బియ్యం ఇస్తామని తెలియజేశారు. ప్రైవేటు స్కూళ్ల సిబ్బందికి 29 కోట్ల రూపాయలు, 3625 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ఖజానాపై ప్రతి నెల దాదాపు రూ. 42.57 కోట్ల భారం పడుతోందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సిఎం కెసిఆర్ ప్రైవేటు టీచర్లకు ఆర్థికంగా సాయం చేస్తున్నారని ప్రశంసించారు. సిఎం కెసిఆర్ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటారని ఆయన చెప్పారు.
- Advertisement -