- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో 50వేల ఉద్యోగాల భర్తీ పక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నూతన జోన్ల ఏర్పాటుకు ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై సిఎం కెసిఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి విడతలో అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. భర్తీకి సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్నారు. ప్రమోషన్లు ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ విడతలో భర్తీ చేయాలని అధికారులకు సిఎం కెసిఆర్ చెప్పారు.
CM KCR high level review on Job Notifications
- Advertisement -