Thursday, November 14, 2024

ఈ నెల12న సిఎం కెసిఆర్ ఇఫ్తార్ విందు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ నెల 12న బషీర్‌బాగ్ ఎల్ బి స్టేడియంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముస్లింలకు ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై హోం మంత్రి మంత్రి మహమూద్ అలీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర మైనారిటీ సంక్షమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎల్ బి స్టేడియంకు చేరుకుని ఇఫ్తార్ పార్టీ ఏర్పాట్లను సహచర మంత్రి, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం , ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు.

రంజాన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఇస్తోందని, అలాగే ఈ ఏడాది కూడా ఇఫ్తార్ విందుకు ఎల్ బి స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి సోమవారం ఎల్ బి స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలిస్తూ ఎవరికీ ఇబ్బందులకు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే మైనారిటీ సంక్షేమానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మత సామరస్యం వెళ్లి విరిసే విధంగా రంజాన్ వేడుకలు నిర్వహించడం జరిగుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సమావేశంలోప్రభుత్వ సలహాదారు ఏకే . ఖాన్, మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్, హజ్ కమిటీ ఛైర్మెన్ సలీమ్, వక్ఫ్‌బోర్డు ఛైర్మెన్ మసీవుల్లా, ఉర్దూ అకాడమి ఛైర్మన్ ముజీబ్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ , మైనారిటీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నదీమ్, డైరెక్టర్ షఫీ ఉల్లాఖాన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News