- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేసిన హోర్డింగులు ఆసక్తిని రేపుతూ, చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే గతవారం రోజులుగా వివిధ రూపాల్లో ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ రేపు ఢిల్లీలో భారీ నిరసన దీక్ష చేపట్టనున్నది. ఈ నేపథ్యంలో వివిధ డిజైన్లతో కూడిన భారీ హోర్డింగ్ లను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఒకే దేశం ఒకే ధాన్యం సేకరణ అనే నినాదంతో ఏర్పాటైన ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను, ఇక్కడి రైతాంగం పట్ల కేంద్రం అనుసరిస్తున్న కుట్రపూరిత విధానాలను సూటిగా ప్రశ్నించెలా ఈ హోర్డింగ్లు ఏర్పాటయ్యాయి. ఢిల్లీ వీధుల్లో నిలదీసేలా ఏర్పాటు అయిన ఈ హోర్డింగులు అప్పుడే విస్తృతమైన చర్చకు తెరలేపాయి.
- Advertisement -