Monday, December 23, 2024

హస్తినలో మేధోమథనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టారు. సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో కెసిఆర్‌కు పలువురు మంత్రులు, ఎంపి లు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన బిఆర్‌ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘దేశ్ కి నేత కెసిఆర్,’ ‘తు మ్ సంఘర్ష్ కరో.. తుమారే సాత్ హై’ అం టూ పెద్ద నినాదాలు చేశారు. దీంతో ఢిల్లీ విమానాశ్రయం ప్రాంగణమంతా ‘కెసిఆర్ జిందాబాద్’ అనే నినాదాలతో మార్మోగిపోయింది. ఢిల్లీలో బిఆర్‌ఎస్ సొంత భవన నిర్మాణాలు పనులు పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో సర్ధార్ పటేల్ రోడ్డులో తాత్కాలిక భవనాన్ని పార్టీ కార్యాల యం కోసం అద్దెకు తీసుకున్నారు.

ఈ నెల 14వ తే దీన కార్యాలయాన్ని కెసిఆర్ లాంఛనగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు, రేపు (మంగళ, బుధవారాల్లో) రెండు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. దీని కారణంగానే రెండు రోజుల ముందుగానే కెసిఆర్ చేరుకున్నారు. మొ త్తం మూడు రోజుల పాటు కెసిఆర్ దేశ రాజధానిలో నే ఉండనున్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి రాజకీయాలపై పలువురు మేధావులతో చర్చించనున్నారు. కాగా నూతన పార్టీ కార్యాలయం పనులు జో రుగా సాగుతున్నాయి. కాగా ఈ పనులను మరోసా రి రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపి సంతోష్‌కుమార్‌లు సోమవా రం కూడా ప్రముఖ వాస్తు శిల్పి సుద్దాల సుధాకర్ తేజతో కలిసి వాస్తుకు అనుగుణంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు.

సుధాకర్ తేజ సూచనల ప్రకారం పార్టీ కార్యాలయ భవనంలో మార్పులు, చేర్పులు, మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. ఉండగా బిఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. వారితో సీఎం కెసిఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ప్రారంభోత్సవానికి హాజరవుతామని పార్టీ కార్యాలయానికి సమాచారం అందించినట్లుగా సమాచారం. కాగా తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం ఢిల్లీకి బయలు దేరుతున్నారు.

ఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. కెసిఆర్ ఫర్ ఇండియా, దేశ్ కీ నేత.. కిసాన్ కీ భరోసా, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాలతో హోర్డింగ్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News