Monday, December 23, 2024

ఆదివాసీ బిడ్డ‌ల‌కు ఎల్ల‌వేళ‌లా అండ‌దండ‌గా ఉంటాం…

- Advertisement -
- Advertisement -

CM KCR inaugurated Adivasi and Banjara buildings

హైద‌రాబాద్ : బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్ -10లో నూత‌నంగా నిర్మించిన సంత్ సేవాల్, కుమ్రం భీం ఆదివాసీ భ‌వ‌నాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ప్రారంభించారు. ఈ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు రూ.50 కోట్ల నిధులను ఖర్చుచేసింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని ఆదివాసీ బిడ్డ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇది భారతదేశ గిరిజనులకు అంతా స్ఫూర్తి అన్నారు. గిరిజనుల ఎన్నో సమస్యలకు పరిష్కారం కావాలన్నారు. దేశవ్యాప్తంగా గిరిజనులకు సమానహోదా రావాలని కెసిఆర్ తెలిపారు. తెలంగాణలో పోడుభూముల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నా హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News