- Advertisement -
న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ సిఎం, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. బిఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు. అనంతరం బిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి, కెసిఆర్ ఆశీనులయ్యారు.
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -