Monday, December 23, 2024

మీ అవినీతి రట్టు చేస్తా

- Advertisement -
- Advertisement -

CM KCR inaugurated Integrated Collectorate office at bhuvanagiri

దేశమంతటా తిరిగి అన్ని భాషల్లోనూ ప్రచారం చేస్తా

కేంద్రంపై పోరుకు అందరికంటే ముందుంటాం

కర్నాటకలో ఆడబిడ్డల మీద రాక్షసుల్లా దాడి చేస్తున్నారు

రాహుల్‌గాంధీని పట్టుకొని అసోం సిఎం అలా అంటాడా?.. నాకైతే కళ్లలో నీళ్లు తిరిగాయి.. మోడీ బిజెపి సంస్కారం ఇదేనా? రాహుల్‌గాంధీ నాయనమ్మ, నాన్న దేశం కోసం ప్రాణత్యాగం చేశారు

మోడీకి పిచ్చి ముదురుతోంది
అందుకే రైతులను ఏడిపిస్తున్నాడు

దేశానికి పట్టిన దరిద్రం బిజెపి దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్క మూతి పిందె దీనిని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది కేంద్రంలోని దొంగలతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మోడీ ప్రభుత్వంపై సమరశంఖారావంలో కలిసొచ్చే వారందరినీ కలుపుకొని పోతా ఇప్పటికే మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్ వంటి సిఎంలు నాతో మాట్లాడుతున్నారు దేశం ఏమైనా మోడీ సొత్తా? ఆయన తన ఇష్టానుసారం దేశాన్ని నాశనం చేస్తూవుంటే ఊరికే కూర్చొని ఉండం తాను ఏం చేసినా చెల్లిపోతుందనే భ్రమల్లో ఉన్నారు మోడీ అనవసరంగా మాతో తలగోక్కుంటున్నారు ఎనిమిదేళ్ల ఆయన పాలనలో ఏ రంగంలోనూ అభివృద్ధి లేదు

ఆరోగ్యసూచీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, అప్పులు ఆకాశాన్నంటుతున్నాయి కేంద్రానికి డంబాచారం తప్పితే ఇంకేంలేదు మంది మీద పడి ఏడ్చుడు, మత పిచ్చి లేపుడు తప్పితే వీళ్లు సాధించిందేమీ లేదు చెత్త పాలసీలతో ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నారు విద్యుత్ సంస్కరణలు అమలుచేస్తేనే డబ్బులిస్తామంటున్నారు ఇలాంటి ప్రధాని దేశానికి అవసరమా? అందుకే మోడీని దేశం తరిమికొట్టాలి నేను ఎవరికీ భయపడే వాడిని కాను… భయపడితే తెలంగాణ వచ్చేదా? రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనతికాలంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపా : యాదాద్రి జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభించి, రాయగిరి బహిరంగసభలో మాట్లాడుతూ కేంద్రంపై పిడికిలెత్తిన ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతి పిందె బిజెపి అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఇలాంటి కుక్కమూతి పిందెల్ని తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి పట్టిన దరిద్రం ఆ పార్టీ అని సిఎం మండిపడ్డారు. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే దేశానికి అంతా మంచి జరుగుతుందన్నారు. కేంద్రంలోని అవినీతి భాగోతాల చిట్టా తన వద్దకు చేరిందని…ఇక మోడీ భాగోతాన్ని త్వరలో బయటపెట్టబోతున్నానని హెచ్చరించారు. దీనిపై దేశమంతా తిరిగి అన్ని భాషల్లో అవినీతి భాగోతాలను ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఇక కేంద్రంలోని దొంగలతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మోడీ ప్రభుత్వంపై సమర శంఖారావం పూరిచేందుకు తనతో కలిసి వచ్చే వారినందరిని కలుపుకుని పోతానని అన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి వారితో తనతో మాట్లాడారన్నారు. భవిష్యత్తులో మరి కొందరు ముఖ్యమంత్రులు కూడా కలువనున్నట్లు తెలిపారు. అందరం కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేస్తామన్నారు.

ఇలా చెప్పడం తన బాధ్యత… ధర్మమన్నారు. శనివారం యాదాద్రి, భువనగిరిలో జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం రాయగిరిలో టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. విమర్శల దాడిని మరింత ఉధృతం చేశారు. మోడీ పాలనలో దేశం పూర్తిగా నాశనం అవుతోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న భ్రమలో ఉన్నారన్నారు. దేశం ఏమైనా మోడీ అయ్య సొత్తా ? అని ప్రశ్నించారు. తన ఇష్టానుసారంగా నాశనం చేస్తూ ఇక్కడ ఊరికే కూర్చోని ఉండరని హెచ్చరించారు. ధర్మాన్ని, నిజాన్ని కాపాడేందుకు తెలంగాణ సమాజం పులిలా కొట్లాడుతుందని ప్రకటించారు. కేంద్రంపై పోరుకు తామే అందరికంటే ముందుంటామన్నారు. తాను అడిగే ప్రశ్నలకు కేంద్రంలోని బిజెపి పెద్దలకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. అందుకే రాష్ట్రంలోని కొందరు బిజెపి నేతలను తనపై ఊసికొల్పుతున్నారని మండిపడ్డారు. పైగా తానొక నీటి చుక్క లాంటివాడినని పేర్కొంటున్నారని, నీటి చుక్కవాడిని అయితే తనను చూసి ఎందుకు వణికిపోతున్నారో చెప్పాలని సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు. అనవసరంగా మోడీ త మతో తల గోక్కుంటున్నారన్నారు. ఎనిమిదేళ్ల మోడీ పాలన లో ఏ రంగంలో అభివృద్ధి జిజిపి అతి దారుణంగా పతనమైందన్నారు. ఆరోగ్య సూచీలు బాగా దెబ్బతిన్నాయన్నా రు. అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయని పేర్కొన్నారు. మం ది మీద పడి ఏడ్సుడు.. మత పిచ్చి తప్పితే వీళ్లు సాధించింది ఏం లేదని కెసిఆర్ దుయ్యబట్టారు.

మోడీకి పిచ్చి ముదురుతోంది

రోజులు గడుస్తున్నా కొద్ది ప్రధాని మోడీకి పిచ్చి ముదురుతోందంటూ సిఎం కెసిఆర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ పిచ్చితోనే రైతులను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. చెత్త పాలసీలు తీసుకువచ్చి ప్రజల జీవితాలను అస్తవ్యస్థం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ఏడాది పాటు రైతులను ఏడిపించిందని విమర్శించారు. విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తేనే డబ్బులిస్తాం, లే కుంటే ఇవ్వబోమంటోంది అంటూ మోడీ ప్రభుత్వాన్ని ఘాటు గా విమర్శించారు. మోడీ హయంలో ఏ రంగానికి న్యాయం జరగడం లేదన్నారు.

భయపడితే తెలంగాణ వచ్చేదా?

కేంద్రంలోని పలువురు మంత్రులు, బిజెపి నాయకులు మాట్లాడిన ప్రతిసారి తన సంగతి చూస్తామని అంటున్నారని, ఏం చూస్తారు? అని సిఎంప్రశ్నించారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని పునరుద్ఘాటించారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడితే తెలంగాణ వచ్చేదా?అని నిలదీశారు. ఆ కేసులు.. ఈ కేసులని భయపడితే ఒంటరిగా 20 ఏళ్ల కిందట రాష్ట్ర సా ధన కోసం బయల్దేరే అని అడిగారు. ఒక లక్షం కోసం.. కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన ప్రాణం పోయినా పర్వాలేదని భావించే పట్టుకుని ప్ర త్యేక రాష్ట్రం కోసం పోరాటంలో దిగి అందులో సా ధించానని చెప్పారు. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనతికాలంలో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపానని అన్నారు. అందుకే రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయన్నారు. బిజెపి ఉంటే పెట్టుబడులు పెట్టేందు కు ఎవరైనా వస్తారా? అని ప్రశ్నించారు. ఇందుకు సిగ్గుపడాలి అంటూ సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

విద్యార్థుల మధ్య మత కలహం

కర్నాకట వివాదంపైనా సిఎం కెసిఆర్ స్పందించారు. కీలక కా మెంట్స్ చేశారు. కర్నాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా? సిలికాన్ వ్యాలీలో ఆడబిడ్డల మీద, విద్యార్థుల మీద దాడులు జరుగుతున్నాయన్నారు. విద్యార్థుల మధ్య మత కల హం పెడుతోంది ఎవరు? ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది నిజం కాదా? మోడీ ఉజ్వలమైన పరిపాలనలో పరిశ్రమలు మూతపడటం ని జం కాదా?అని నిలదీశారు. దేశం ఎవరి అయ్య సొత్తు కాదన్నారు.

ఆకలి సూచీలో 101వ స్థానం

దేశంలో ఆకలి చావులు పెరుగుతుంటే మోడీ ప్రభుత్వం ఏం చేస్తోందని కెసిఆర్ ప్రశ్నించారు. ఆకలి సూచీలో భారత్ స్థా నం 101లో ఉండడం సిగ్గుచేటు మరోటి ఉండదన్నారు. మోడీ పాలన గొప్పగా ఉంటే పవిత్ర గంగానదిలో శ వాలు తేలుతాయా? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో కోట్ల మంది వేల కిలోమీటర్లు రోడ్లపై నడిచారన్నారు. అందు లో చాలామంది అంతదూరం నడువలేక ఉత్తి పుణ్యానికి చనిపోయారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం వలస కార్మికులకు కడుపులో పెట్టుకుని చూసుకుందని గుర్తుచేశారు. వారు సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేసి, ఖర్చులకు కొంత నగదు కూడా ఇచ్చామన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఈ స్థాయిలో పనిచేస్తుంటే మోడీ సర్కార్ మరెంత బాధ్యతగా పనిచేయాల్సి ఉండాలని ప్రశ్నించారు.

రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి

రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని సిఎం కెసిఆర్ అన్నా రు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సంపద బాగా పెరిగిపోయిందన్నా రు. మిషన్ కాకతీయలో చెరువులను అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు. అలాగే భూ ముల విలువ కూడా విపరీతంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అయితే అర, ఎకరా భూమి ఉన్న సామాన్య వ్యక్తి కూడా కోటీశ్వరుడే అని అన్నారు. అలాగే దళితులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించామన్నారు. కొత్తగా ఏర్పా టు అవుతున్న పరిశ్రమలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జోనల్ విధానం ద్వారా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయన్నారు. ఉద్యోగాల విషయంలో కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని

హేళన చేసిన రాష్ట్రంలోనే కరెంటు లేదు

గతంలో మీకు పరిపాలన చేతకాదని ఉమ్మడి పాలకులు మనలను ఎద్దేవా చేశారని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రంలో కరెంట్ ఉండదు. అంతా చీకటే అ న్నారని, అప్పుడు అలా చెప్పిన రాష్ట్రంలోనే కరెంట్ లేదన్నారు.

యాదాద్రి కూడా హైదరాబాద్‌లోనే..

ప్రస్తుతం యాదాద్రి కూడా హైదరాబాద్‌లో దాదాపుగా కలిసి పోయినట్టేనని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. భువనగిరి జి ల్లా ఏర్పాటు చేసుకొని, అద్భుతమైన జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించింకున్నందుకు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు. భువనగిరిప్రత్యేకంగా జిల్లా అవుతుందని కలలో కూడా ఎవరూ అనుకున్న మాట కాదన్నారు. యాదాద్రి పూర్తయితే మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. భువనగిరి ర్యాపిడ్‌గా వేగంగా డెవలప్ అయ్యే ప్రాంతం అన్నారు. బిబి నగర్, భువనగిరి, ఘట్కేసర్, హైదరాబాద్ అంతా కలిసిపోయి కారిడర్‌గా ఉంటుందన్నారు. తాను కలగనే కారిడార్ వరంగల్ హైదరాబాద్ అద్భుతమైన కారిడార్ అవుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏర్పాటు ప్రక్రియ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు సంప్రదించి మొదటి వ్యక్తి చత్తీస్‌గఢ్ చీఫ్ అడ్వైజర్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కా లని ఉద్యమం చేసిన సందర్భంలో తాను ఆయనను డజన్ సా ర్లు కలవడం జరిగిందన్నారు.

భూములు ధరలకు రెక్కలు

రాష్ట్రంలో ఎక్కడవెళ్లినా భూముల ధరలు పెరిగాయని సిఎం తె లిపారు. భువనగిరి, యాదాద్రిలో భూముల ధరలు ఎట్ల ఉ న్నాయని ప్రశ్నించిన ఆయన ఒకప్పుడు ఎట్ల ఉండే.. డు గుట ్టపొంటి సైతం కోట్లే నని అన్నారు. మారుమూల గ్రామాలకు పోతే రూ.25 నుంచి -30లక్షల్లోపు ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ శివారులోని కర్ణాటకలో రూ.4 లక్షలు, రూ.5 లక్షలకే ఎకరం పొలం ఉంటే మన ప్రాంతంలో మాత్రం రూ.25లక్షలకు తక్కువ లేదని అన్నారు.

రైతులను గుర్రాలతో తొక్కించారు

సమైక్య రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కెసిఆర్ అన్నారు. అందుకే రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెం టు ఇంకా ఎన్నో సదుపాయాలు చేసుకుంటున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నూతన వ్య వసాయ చట్టాలు తెచ్చి ఏడాది పాటు రైతులను ఏడిపించిన్రు. ఢిల్లీ దగ్గర రైతులను అవమానపరిచారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు రాగానే ప్రజలకు భయపడి ఆ బిల్లులు వాపస్ తీసుకొని ప్రధాని స్వయంగా క్షమాపణ కోరారన్నారు.

మోడీ దోస్తుల కంపెనీల ?

మోడీ దోస్తుల కంపెనీల నుంచి సోలాప్ పవర్ కొనాలని రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. పెట్టుబడిదారులు ఎవరో 30 వేల మెగావాట్ల సోలార్ పవర్ పెడుతడ ట.. మనం కొనాలన్నట అని అన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఇదే జిల్లాలో పులిచింతలకాడ మనకు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ఉందన్నారు. అది ఉన్నా కూడా దాన్ని బంద్ పెట్టి మోడీ తరఫున పెట్టుబడిపెట్టే షావుకార్లు ఇచ్చేదే కొనాలని తొండి చే స్తున్నారని విమర్సించారు. దానికి అందమైన పేరు విద్యుత్ సంస్కరణలు అని కెసిఆర్ ఎద్దేవా చేశారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే మీకు డబ్బులు ఇస్తం.. ఇయ్యమని మోడీ ప్రభుత్వం అంటోందని, దీన్ని ఒప్పుకుందమా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనం ఫ్రీగానే కరెంటు ఇవ్వాలంటూ నినదించారు.

చనిపోయినా సరే..
విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోను

తాను చనిపోయినా సరే.. విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోనని సిఎం కెసిఆర్ ఖరాఖండిగా స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బావులకు మీటర్లు పెట్టేదే లేదన్నారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందన్నారు. ఇందులో 2 లక్షల మెగావాట్ల కంటే విద్యుత్ వినియోగం ఉండదన్నారు. ఇంకా రెండు లక్షల మెగావాట్ల కరెంటు మిగిలుంటుందన్నారు. దీనిపై కేంద్రానికి అసలు మెదడు లేదని విమర్శించారు. కరెంటు సరైన రీతిలో వినియోగించుకునే సామర్ధం కూడా కేంద్రం వద్ద లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న విధంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రమైన 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. అలాగే దేశంలో 65 వేల టిఎంసిల నీళ్లున్నా.. 35 వేల టిఎంసిలకు మించి వాడలేదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News