Sunday, December 22, 2024

జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: సిఎం కెసిఆర్ బుధవారం జగిత్యాలలో పర్యటిస్తున్నారు. హెలీకాప్టర్‌ ద్వారా జగిత్యాలకు చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మొదట నూతనంగా నిర్మించిన టిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం వద్ద గులాబీ జెండాను ఎగుర వేశారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యాలయంలో విద్యాసాగర్‌రావును సీట్లో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత సిఎం వైద్య కళాశాలకు భూమిపూజ చేశారు. అనంతరం నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. చాంబర్‌లోని సీట్లో కలెక్టర్‌ రవిని కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సారెస్పీ ఆబాది స్థలం 20 ఎకరాల్లో సమీకృత జిల్లా కార్యాలయాలన్ని రూ.49.20 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News