Friday, November 22, 2024

బిడ్డ కోసం కేసీఆర్ కిట్.. తల్లి కోసం న్యూట్రిషన్ కిట్: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని విస్తరించి, అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయంలో సంతకం చేశారు. అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో సీఎం కేసీఆర్ కు ఆరోగ్య మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తూ సీఎం కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ఇప్పటికే 9 జిల్లాల్లో అమలు అవుతుండగా, అన్ని జిల్లాల్లో పంపిణీ చేయనున్నాం. గర్బిణిగా ఉన్నపుడు న్యూట్రిషన్ కిట్, బాలింతగా ఉన్నపుడు కేసీఆర్ కిట్. న్యూట్రిషన్ కిట్స్ గర్భిణులకు వరంగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింది. మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచాం. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు సీఎం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ పథకానికి రూపకల్పన చేశారు.

Also Read: కొత్త సచివాలయంలో కొలువుదీరిన మంత్రులు

రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ కిట్ సూపర్ హిట్ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లకు రూపకల్పన చేసింది. నాలుగు ఏఎన్‌సీ చెకప్స్, కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు వంటివి రాష్ట్రంలో మాతా సిస్టం రక్షణకు దోహాదం చేస్తున్నాయి. నూతన సచివాలయం ప్రారంభం రోజు ముఖ్యమంత్రి గొప్ప పథకం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేయడం సంతోషకరం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో ఈ కార్యక్రమం మిగతా 24 జిల్లాల్లో ప్రారంభిస్తాం” అని వెల్లడించారు.

కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ లో ఉండేవి…
1.కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్ ,2. కిలో ఖర్జూర, 3.ఐరన్ సిరప్ మూడు బాటిల్స్, 4. 500 గ్రాముల నెయ్యి, 5. కప్పు, 6. పల్లిపట్టి 200 గ్రాములు, 7. ప్లాస్టిక్ బాస్కెట్
రక్త హీనత(ఎనీమియా) గర్బిణుల పాలిట శాపంగా మారుతున్నది. గర్బిణులకు ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. ఎనీమియా నివారిస్తే మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించడంలో గొప్ప వృద్ధిని నమోదు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News