Friday, December 20, 2024

రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

CM KCR inaugurated Ranga Reddy District Collectorate

ఇబ్ర‌హీంప‌ట్నం: రంగారెడ్డి జిల్లా స‌మీకృత క‌లెక్ట‌రేట్ స‌ముదాయాన్ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ గురువారం ప్రారంభించారు. ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలోని కొంగ‌ర‌క‌లాన్‌లో 44 ఎక‌రాల్లో రూ. 58 కోట్ల వ్య‌యంతో మూడు అంత‌స్తుల్లో విశాల‌మైన గ‌దుల‌తో క‌లెక్ట‌రేట్ ను నిర్మించారు. క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సిఎస్ సోమేశ్ కుమార్, క‌లెక్ట‌ర్ అమ‌య్ కుమార్, మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డితో పాటు మ‌హేశ్వరం, కల్వకుర్తి, షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, ఎల్బీన‌గ‌ర్‌ నియోజకవర్గాలకు చెందిన ఎంఎల్ఏలు, ఎమ్మెల్సీలు, ప‌లువురు నాయ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News