Saturday, November 23, 2024

ఇక భక్త జనాద్రి

- Advertisement -
- Advertisement -

CM KCR inaugurated Yadadri Temple

చూపుల పండువగా, వైభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ

అసమాన దీక్షతో అనతికాలంలో
అపూర్వ, అపురూప శిల్పకళాత్మకంగా
ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దిన
నూతన యాదాద్రి జాతికి అంకితం
మహా పూర్ణాహుతితో మొదలైన
సంప్రోక్షణ ఉత్సవాలు
బాలాలయంలోని నృసింహ స్వామి,
అమ్మవార్ల మూర్తులతో నిర్వహించిన
శోభాయాత్రలో పాల్గొన్న సిఎం
కెసిఆర్, శోభ దంపతులు, మంత్రులు,
ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు,
అధికారులు, అర్చకులు, వేద
పండితులు వేద మంత్రోచ్ఛారణలు,
మేళతాళాల మధ్య వైభవంగా
శోభాయాత్ర, ఆలయ ప్రదక్షిణలు
సప్త గోపురాలపై ఉన్న కలశాలకు
ఏకకాలంలో కుంభాభిషేకం
శ్రీ సుదర్శన హూఘేకానికి సిఎం కెసిఆర్
పవిత్ర జలాభిషేకం సుదీర్ఘ వ్యవధి
తర్వాత కాలినడకన వచ్చి తొలిసారి
స్వామిని సందర్శించుకున్న భక్తజనం

మనతెలంగాణ/హైదరాబాద్ : నమో నారసింహా.. యాదాద్రీశా గోవిందా.. శ్రీలక్ష్మీ నరసింహస్వామి నామస్మరణ, భక్తుల జయ జయధ్వానాల మధ్య సోమవారం యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా వైభవంగా జరిగింది. మహాకుం భ సంప్రోక్షణ తొలిపూజలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొనగా, ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వచనం అందించారు. భక్తకోటి ఎదురుచూస్తున్న మహాద్భుత ఘట్టం సోమవారం ఉదయం 11 గంటల 55 నిమిషాలకు శ్ర వణా నక్షత్రయుక్త మిథున లగ్న అభిజిత్ ముహూర్తాన జరిగింది. అంతకు ముందు ఉదయం చతుస్థానార్చనలు, పరివార శాంతి ప్రాయశ్చిత్త హోమం, బలిహరణం, మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, గర్తన్యాసము, రత్నన్యాసము, యంత్ర ప్రతిష్ఠ, బింబ ప్రతిష్ఠ, అష్ట బంధనం, కళారోపణం, ప్రాణ ప్రతిష్ఠ, నేత్రోన్మీలనం, దృష్టి కుంభం వంటి పూజలను ఘనంగా జరిపిన ఆలయ అర్చకులు అనంతరం మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవానికి శీకారం చుట్టారు.

ఈక్రమంలో సోమవారం ఉదయమే మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి.బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల దేవతామూర్తులతో నిర్వహించిన శోభాయాత్రల్లో సిఎం కెసిఆర్, ఆయన సతీమణి శోభతో పాటు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి, ప్రభుత్వం అధికారులు,అర్చకులు, పండితులు పాల్గొన్నారు. శోభాయాత్రలో భాగంగా బంగారు కవచమూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అళ్వార్లు ప్రదర్శించడంతో పాటు కళా ప్రదర్శనలు జరిపారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛరణలు,మేళ తాళాల మధ్య శోభాయాత్ర వైభవంగా కొనసాగగా, ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేశారు. ప్రధానాలయ పంచతల రాజగోపురం వద్ద సిఎం కెసిఆర్ స్వయంగా స్వామివారి పల్లకీని మోశారు.మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా, దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు చేసి పవిత్ర కాళేశ్వరుని గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు కంకణధారణ చేసి పండితు లు ఆశీర్వదించారు. సప్త గోపురాలపై ఉన్న కలశాలలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. రాజగోపురాలపై స్వర్ణ కళశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ చేశారు. విమాన గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞ చార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయాణీకులు అత్యంత వైభవము గా నిర్వహించారు. అనంతరం నవ్య యాదాద్రిని ముఖ్యమంత్రి కెసిఆర్ జాతికి పునరంకితం చేశారు. దేదీప్యమానంగా వెలిగిపోతోన్న గర్భగుడిలో కొలువుదీరిన స్వామివారిని దర్శించి తరించేందుకు భక్తులు పోటెత్తారు. కాలినడకన కొండపైకి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. భక్తులను దృష్టిలో పెట్టుకున్న అధికారులు కొండపైకి ప్రత్యేక ఆర్‌టిసి బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు.

కలశాలకు కుంభాభిషేకం :

వారం రోజుల పాటు పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు నిర్వహించిన మహాకుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా సాగింది. ఈక్రమంలో 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ జరిపారు. రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిగింది. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి ముఖ్యమంత్రి సమక్షంలో మహాసంప్రోక్షణ నిర్వహించారు. అదే సమయంలో మంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన గోపురాలు, ప్రాకార మండపాలకు సంప్రోక్షణ నిర్వహించారు. ఆంజనేయస్వామి సన్నిధిలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డ్డి, గరుడ ఆళ్వార్ సన్నిధిలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, తూర్పు రాజగోపురం వద్ద మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంప్రోణక్షలో పాల్గొన్నారు. ఈశాన్య ప్రాకార మండపం -22కు మంత్రి తలసాని, 24వ మండపం వద్ద మంత్రి హరీశ్‌రావు, పశ్చిమ రాజగోపురానికి మంత్రి జగదీశ్‌రెడ్డ్డి, దక్షిణ రాజగోపురానికి మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు మిగతా మంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన చోట సంప్రోక్షణ, అభిషేకాలు నిర్వహించారు.

సిఎం తొలిపూజ..:

మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం తర్వాత వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రధానాలయంలోకి 12.20 గంటలకు వెళ్లిన సిఎం కెసిఆర్ దంపతులు స్వామివారికి ప్రథమారాధన చేశారు. ఉపాలయాల్లో ప్రతిష్ఠా మూర్తులకు మహా ప్రాణన్యాసం నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆరగింపు సేవ చేశారు. తర్వాత తీర్థ, ప్రసాద గోష్టి జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ మహాపర్వంలో పాల్గొని స్వామివారిని సేవించుకుని తరించారు.

సిఎం పర్యటన సాగిందిలా :

హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 8.52 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్లో కుటుంబ సమేతంగా యాదాద్రి బయలు దేరిన, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు, యాదాద్రి చేరుకున్నారు. ఉదయం 9:50 గంటలకు బాలాలయంలో కవచమూర్తులను, ఉత్సవమూర్తుల ఊరేగింపుగా శోభాయాత్రను సిఎం కెసిఆర్ దంపతులు పల్లకిమోసి ప్రారంభించారు. ప్రదక్షిణల అనంతరం 10:39 గంటలకు ప్రధానాలయం తూర్పు రాజగోపురం ద్వారా ఉత్సవమూర్తులు ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడినుంచి ముఖమండపానికి ఉత్సవమూర్తులు చేరుకున్న అనంతరం విమాన గోపురం, వివిధ రాజ గోపురాలపై అర్చకులు పూజలు ప్రారంభించారు. 11:40 గంటలకు ప్రధానార్చకులు మహాసంకల్పాన్ని ప్రారంభించారు. 11:55 గంటలకు దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు చేసి, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. అలాగే మూల విరాట్టు వద్దకు చేరుకుని పున: ప్రారంభ పూజలు నిర్వహించారు. యాదాద్రి దివ్యక్షేత్రాన్ని మహాకుంభ సంప్రోక్షణతో పునఃప్రారంభం చేసిన అనంతరం సిఎం కెసిఆర్ దంపతులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, భోజన ఆతిథ్యాలు స్వీకరించి, మధ్యా హ్నం 3 గంటలకు హైదరాబాద్ కు తిరిగి బయల్దేరి వెళ్లారు.

చారిత్రక ఘట్టంలో పాల్గొన్న ప్రముఖులు ః

యాదాద్రి ఆలయ పునః నిర్మాణ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు , చామకూర మల్లారెడ్డి, మహమూద్ అలి, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, నామా నాగేశ్వర్ రావు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్‌సిలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, విఠల్ దండే, తాతా మధుసూధన్, మంకెన కోటిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, బండా ప్రకాష్, కె.నవీన్ రావు, శేరి సుభాష్ రెడ్డి, గోరటి వెంకన్న, సిరికొండ మధుసూధనాచారి , మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌లు పాల్గొన్నారు.

అలాగే ఎంఎల్‌ఎలు బాల్కసుమన్, ఆజ్మీరా రేఖా, జి.విఠల్ రెడ్డి, ఎ.జీవన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జాజాల సురెందర్, బాజిరెడ్డి గోవర్దన్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుకంటి చం దర్, సుంకే రవిశంకర్, రసమయి బాలకృష్ణ, పద్మాదేవేందర్ రెడ్డి, క్రాంతి కిర ణ్, భేతి సుభాష్ రెడ్డి, కాలె యాదయ్య, రోహిత్ రెడ్డి, ముఠాగోపాల్, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, సి.లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బండ్ల కృష్టమోహన్ రెడి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, శానంపూడి సైదిరెడ్డి, ఫైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, గొంగిడి సునీత, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, బానోతు శంకర్ నాయక్, చల్లా ధర్మారెడ్డి, వివేకానంద, నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, గండ్ర వెంకటరమణా రెడ్డి, రేగ కాం తారావు, బానోతు హరిప్రియ, కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులన్నారు.

అదేవిధంగా టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ రె డ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి, బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు కె.కిశోర్ గౌడ్, ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, టిఎస్‌ఎమ్‌ఎస్‌ఐడిసి చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్పో రట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టిఎస్‌ఇడబ్ల్యూఐడిసి చైర్మన్‌రావుల శ్రీధర్ రెడ్డి, రాష్ట్రటూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, షీప్స్ అండ్ గోట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమె ట్ల బాలరాజ్ యాదవ్ తదితర నా యకులు పాల్గొన్నారు.ప్రభుత్వ ఉన్నతాధికారులు సిఎస్ సోమేశ్ కుమార్, సి ఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, సిఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి, సిఎం ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంత కుమారి, ఎండోమెంట్ కమిషనర్ వి.అనిల్‌కుమార్, శాసనసభ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, యాదా ద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ సిపి మహేశ్ భగవత్ పాల్గొన్నారు.

పల్లకి మోసిన సిఎం కెసిఆర్

యాదాద్రిలో ప్రధానాలయ పంచతల రాజగోపురరం వద్ద కెసిఆర్ స్వయంగా స్వామివారి పల్లకిని మోశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మడి వస్త్రాలు ధరించి సతీసమేతంగా శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో సిఎం కుటుంబసభ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. పంచకుండాత్మక యాగం పూర్ణాహుతి అనంతరం బాలాలయం నుంచి వేదమంత్రోశ్చరణల నడుమ స్వామివారి సువర్ణమూర్తుల శోభాయాత్ర వైభవంగా సాగింది. ఆరేళ్ల తర్వాత స్వామివారు బాలాలయం నుంచి తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి ప్రవేశించారు. శోభాయాత్రలో భాగంగా పునర్నిర్మితమైన ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రగా సిఎం దంపతులు ప్రదక్షిణలు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News