Saturday, December 21, 2024

కెసిఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కెసిఆర్ ప్రసంగించారు. సిద్దిపేటలో ఉద్యోగ గర్జన చేసినప్పుడు నాటి రోశయ్య ప్రభుత్వం హైదరాబాద్ ఫ్రీ జోన్ అని 14 ఎఫ్ తీసుకొస్తే నిరసన వ్యక్తం చేశామని కెసిఆర్ గుర్తు చేశారు. అప్పుడే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని ప్రకటన చేశానని ఆయన తెలిపారు. కెసిఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని బయల్దేరానని ఆయన పేర్కొన్నార. నిమ్స్ డాక్టర్లు కూడా తననను బెదిరించారని, శక్తి లేదు, కోమాలోకి వెళ్తే మళ్లీ బయటకు రాలేవని చెప్పారన్నారు. దానిని కూడా తట్టుకోని నిలబడ్డానన్నారు.

విద్యార్థులు, నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తుంటే కేంద్రం దిగివచ్చిందని కెసిఆర్ తెలిపారు. లోక్‌సభలో చర్చ జరుగుతుంటే తాను నిమ్స్‌లో ఉండి చూశానని, మొత్తం భారత రాజకీయ వ్యవస్థ అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వచ్చిందని, ఆ తర్వాత దీక్ష విరమించానని కెసిఆర్ తెలిపారు. ఆ తర్వాత కుట్రలు, సమైక్యవాదులు చేశారని, పార్లమెం ట్‌లో కూడా పెప్పర్ స్ప్రేలు చల్లి తెలంగాణ రాకుండా అడ్డుకున్నారని, ఆ విషయాలు మీకందరికీ తెలుసని కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News