Monday, December 23, 2024

ఇదిగో.. పేదల ఆత్మగౌరవ సౌధం

- Advertisement -
- Advertisement -

ప్రారంభానికి సిద్దంగా కొల్లూరులో కెసిఆర్ నగర్ టౌన్‌షిప్
నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
ఏసియాలోనే అతి పెద్ద నిరుపేదల హౌజింగ్ టౌన్‌షిప్
సాకారం కాబోతున్న పేదల సొంతింటి కల
మన తెలంగాణ /హైదరాబాద్: పేదల సొంతింటికల సాకారం కాబోతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజక వర్గ పరిధిలో ఆర్‌సి పురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన ఏసియాలోనే అతి పెద్ద నిరుపేదల హౌసింగ్ టౌన్‌షిప్ కెసిఆర్ నగర్ రెండు పడుకగదుల గృహ సముదాయం ప్రారంభోత్సవానికి సిద్దం అయ్యింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పరంగా లబ్ధిదారులకు ఒక్క నయ పైసా ఖర్చు లేకుండా ఉచితంగా పంపిణీ చేసే అతి పెద్ద హౌసింగ్ ప్రాజెక్టు ఇది. సకల సౌకర్యాలతో గెటెడ్ కమ్యూనిటీలకు దీటుగా కొల్లూరులో నిర్మించిన 15,660 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల టౌన్ షిప్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. నిరుపేదలు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఆకాంక్ష, ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పంతో జిహెచ్‌ఎంసి పరిధిలో ఎంపిక చేసిన 111 ప్రాంతాలలో ఒక లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ లక్ష్యం పూర్తికాబొతోంది.

కొల్లూరులో సకల హంగులతో, మౌలిక సదుపాయాల కల్పనలో కూడా చిన్న సమస్య ఉత్పన్నం కాకుండా పటిష్టమైన, మెరుగైన సౌకర్యాలు కల్పించి పేదలకు పంపిణీ చేయనున్నారు. రూ.1474.75 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ ప్రాజెక్ట్ లో కార్పొరేట్ స్థాయి అపార్ట్ మెంట్ లకు తీసి పోకుండా సకల హంగులతో వీటిని నిర్మించారు. 117 బ్లాక్ లుగా గృహాల నిర్మాణాలు చేపట్టారు. అవసరాన్ని బట్టి ప్రతి బ్లాక్ రెండు లేదా మూడు స్టేయిర్ కేస్ ను ఏర్పాటు చేశారు. స్టిల్ట్ పార్కింగ్ తో పాటు పెవ్ బ్లాక్, వాచ్ మెన్ గది ఏర్పాటు చేశారు. ప్రమాదాల నియంత్రణకు ఫైర్ ఫిటింగ్, 8 మంది కెపాసిటీ గల ప్రతి బ్లాక్ కు రెండు చొప్పున 234 లిఫ్ట్ లను ఏర్పాటు చేశారు.

లిఫ్ట్ , గృహాలకు నిరంతర విద్యుత్ కోసం పవర్ బ్యాక్ అప్ కోసం ప్రత్యేక జనరేటర్ ఏర్పాటు చేశారు. కాలనీ వాసులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్కు, సైక్లింగ్ వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్, ఓపెన్ జిమ్ ఇండోర్ స్పోర్ట్ కాంప్లెక్స్, ఓపెన్ స్పోర్ట్స్ ఏరియా, కిడ్స్ ల్లాట్ టట్స్, మల్టీపర్పస్ గ్రౌండ్, హంపి థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం బతుకమ్మ ఘాట్ ఏర్పాటు. చేశారు. అదేవిధంగా కాలానీ వాసుల కోసం ఆధునిక కూరగాయల, మాంసాహార మార్కెట్ ఏర్పాటుతో పాటు ప్లే స్కూల్, అంగన్ వాడి సెంటర్, బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు. ప్రాథమిక , ఉన్నత పాఠశాలబస్ టెర్మినల్, బస్ స్టాప్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, మిల్క్ బూత్ లు, పెట్రోల్ బంకులు పోస్టాఫీసు, ఎ.టిఎం బ్యాంక్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.

ప్రత్యేక మౌలిక వసతులు, సదుపాయాలు ః
* 6 నుండి 36 మీటర్ల వెడల్పు గల 13.50 కిలోమీటర్ల రోడ్డు. భవిష్యత్తులో రోడ్డు కటింగ్ లేకుండా నాలా ఏర్పాటు.
* 21 వేల కె.ఎల్ సామర్థ్యం గల వాటర్ స్టోరేజ్ అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు. .అండర్ గ్రౌండ్ ద్వారా విద్యుత్ కేబుల్ ఏర్పాటు.
* కామన్ ఏరియాలో లైటింగ్, లిఫ్టులకు వాటర్ సప్లై , ఎస్.టిపి లకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం 30 కేవిఎ నుండి 400 కె.వి.ఎ వరకు 133 జనరేటర్ ఏర్పాటు.
* రూ. 10 కోట్లతో 9 ఎంఎల్.డి సామర్థ్యం గల ఎస్.టిపి ని ఈఎమ్‌బిబిఆర్ అత్యాధునిక (మూవింగ్ బెడ్ బయో రియాక్టర్) పద్దతిలో ఏర్పాటు. చుట్టూ రోడ్డు వసతి.
* మురుగు నీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్ చేసే ఏర్పాటు. సుందరీకరణ పనులకు నీటిని అందించేందుకు అవసరమైన పైప్ లైన్ ఏర్పాటు.
* వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు. మురికి నీరు బాక్సుల పైన 10.55 కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు.
* 10.05 కి మీ త్రాగు నీటి పైప్ లైన్, 10.60 కి మీ అండర్ గ్రౌండ్ పైప్ లైన్,137 విద్యుత్ ట్రాన్స్ పార్మర్లు, వీధి దీపాల కోసం 528 పోల్స్, హైమస్కు లైట్ కోసం 11
పోల్స్ ఏర్పాటు చేశారు.
* 54000 స్క్వేర్ ఫీట్ గల 3 షాపింగ్ కాంప్లెక్స్ లలో 118 షాపులు ఏర్పాటు. సామాజిక వసతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.

62 వేల డబుల్ బెడ్ రూమ్ గృహలు పంపిణీ కి సిద్దం
జిహెచ్‌ఎంసిలో నివసించే నిరుపేదల కోసం 111 లొకేషన్ లో 1 లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి మొత్తం ప్రాజెక్టు వ్యయం 9,714.59 కోట్లు కాగా అందులో 6,867 కోట్ల ఖర్చుతో 98 వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అందులో 68,176 ఇళ్లును 71 లొకేషన్లలో పూర్తి చేశారు.మిగతా గృహాలు 38 లొకేషన్లలో వివిధ ప్రగతి దశలో కలవు. 2 లొకేషన్లలో 2,026 గృహాలు వివిధ కారణాల వల్ల నిర్మాణాలను చేపట్టలేకపోయారు. అందులో42 లొకేషన్ లలో చేపట్ 62,516 రెండు పడకల గదులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మారో 29 లొకేషన్ (ఇన్ సీటు)పేదల పాత గృహాల తొలగించి కొత్త గృహాలను నిర్మించిన 5,660 గృహాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

జిహెచ్‌ఎంసి ఔట్‌సైడ్ జిహెచ్‌ఎంసిలో చేపట్టిన గృహాల వివరాలు
జిహెచ్‌ఎంసిలిమిట్ లో 40 ఇన్ సీటు లొకేషన్ 8,898 రెండు పడకల గదులు, 17 వేకెంట్ ప్రదేశంలో 5,775 గృహాలు మొత్తం 57 లొకేషన్లలో 14,673 గృహాలు చేపట్టారు..జిహెచ్‌ఎంసి, ఓ.ఆర్.ఆర్ మధ్యలో 32 ఖాళీ ప్రదేశాల్లో 49,991 గృహాలు.ఓఆర్‌ఆర్ బయట ఉన్న 22 ఖాళీ ప్రదేశాల్లో 35,336 గృహాల నిర్మాణాలను చేపట్టారు జి హెచ్ ఏం సి లో 111 లొకేషన్ లలో లక్ష గృహాల నిర్మాణాలకు మొత్తం 40 ఇన్ సీటు ప్రదేశాలలో 8,898 రెండు పడకల గదులు, 71 ఖాళీ ప్రదేశాల్లో 91,102 గృహాల నిర్మాణాలను చేపట్టారు.

గ్రేటర్ పరిధిలోని జిల్లా ల వారిగా వివరాలు
ఈ నేపథ్యం లో హైదరాబాద్ జిల్లాలోమొత్తం ఇన్ సిటు, ఓపెన్ గల 38 లొకేషన్ లలో 13 నియోజక వర్గాల పరిధిలో గల 70.73 ఏకరాల స్థలంలో 9453 గృహాలు, రంగా రెడ్డి జిల్లాలో 30 లొకేషన్లలో 3 అసెంబ్లీ నియోజక వర్గం లో 151.36 ఏకరాల స్థలంలో 23,908 గృహాలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 33 లొకేషన్ లో 3 నియోజక వర్గం లో 38,419, సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజక వర్గం లో 191.79 ఏకరాలలో 10 లొకేషన్లలో 28,220 గృహాలు చేపట్టారు. 111 లొకేషన్ 668.73 ఏకరాల స్థలం లో ఒక లక్ష్య గృహాల నిర్మాణాలను చేపట్టారు.నగరంలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లనిర్మాణాలు జిహెచ్‌ఎంసిఇంప్లిమెంట్ ఏజెన్సీ గా వ్యవహరిస్తున్నది. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం (బిహెచ్‌కె) ప్రత్యేకంగా జిహెచ్‌ఎంసిపరిధిలో గల అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వెకెంట్ ల్యాండ్, గతంలో ఉన్న ఇన్ సీటు ప్రదేశాలలో ఇళ్లను తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సకల సౌకర్యాల తో ప్రతి గృహంలో రెండు బెడ్ రూంలు, ఒక కిచెన్, రెండు మరుగుదొడ్ల తో మొత్తం 560 స్క్వేర్ ఫీట్ లలో గృహ నిర్మాణం చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News