Wednesday, January 22, 2025

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

- Advertisement -
- Advertisement -

మహహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి స‌మీపంలో పాల‌కొండ వ‌ద్ద కొత్తగా నిర్మించిన సమీతకృత కలెక్టరేట్‌ భవనాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రారంభించారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న సిఎం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాంబర్‌లో కలెక్టర్‌ వెంకట్రావ్‌ను సీట్‌లో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News