సిద్దిపేట: లక్షలాది ఎకరాలకు సాగునీరును అందించే అతిపెద్ద జలాశయం మల్లన్న సాగర్‌ను బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయాన్ని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ జాతికి అంకితం చేశారు. కొమురవెల్లి మల్లన్నకు సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్విచ్ఛాన్ చేసి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లోకి సిఎం కెసిఆర్ నీటిని విడుదల చేశారు. కాగా, మల్లన్న సాగర్ జలాశయం తెలంగాణ నడినెత్తిన సంద్రాన్ని తలపించేలా నిర్మించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద జలాశయంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిలువనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నింటిలోనూ మల్లన్నసాగరే అతి పెద్దది. సిద్దిపేట జిల్లా తొగుట–కొండపాక మండలాల శివారులో గుట్టల మధ్య ఈ జలాయాన్ని నిర్మించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ మహా జలాశయానికి 5 ఓటీ స్లూయిస్‌లు (తూములు) ఉన్నాయి. అత్యంత ఎత్తు మీద నిర్మించిన జలాశయంగా మల్లన్న సాగర్ ప్రత్యేకతను సంతరించుకుంది.
CM KCR Inaugurates Mallanna Sagar Project