Saturday, November 2, 2024

కొత్త సచివాలయంలో కొలువుదీరిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత మంత్రులు తమ చాంబర్లలో ఆసీనులయ్యారు. సంబంధిత ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. మంత్రి హరీశ్ రావు తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రెండు దస్త్రాలపై సంతకం చేశారు. టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్స్ ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ ఫైల్ పై మొదటి సంతకం చేయగా, ఇటీవల అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు పంట సాయం కింద రూ. 151. 64 కోట్ల నిధుల విడుదల ఫైల్ పై రెండవ సంతకం చేశారు.

Also Read:బిజెపి ఉన్మాద రాజకీయం : కూనంనేని

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ః
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలో మధ్యాహ్నం మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి కొలువుదీరారు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న 19,800 మంది ఉపాధ్యాయులకు రూ. 34.25 కోట్లతో ట్యాబ్ లను, 5వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ లను ఏర్పాటు చేసే ఫైళ్ళ పై నూతన సచివాలయంలో తొలి సంతకం పెట్టారు.

పాఠశాలలను పునః ప్రారంభించే జూన్ 12 వ తేదీ నాటికి ట్యాబ్ లను ఉపాధ్యాయులకు అందించడం జరుగుతుంది. అదే విధంగా లైబ్రరీ కార్నర్ లను కూడా జూన్ 12 వ తేదీ నాటికి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంకా నుంచి నూతన సచివాలయం మొదటి అంతస్తులోని బి వింగ్ కార్యాలయం నుంచి మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఇకనుంచి తన విధులను నిర్వర్తించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News