Monday, January 20, 2025

యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ విల్లాను ప్రారంభించిన సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

CM KCR Inaugurates presidential villa in Yadadri

యాదాద్రి భువనగిరి: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం యాదాద్రి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి దేవాలయానికి సమీపంలో నిర్మించిన వీవీఐపీల విడిది ప్రెసిడెన్షియల్ విల్లాను ముఖ్యమంత్రి ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జి.జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ లు ఎలిమినేటి కృష్ణారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంసి కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CM KCR Inaugurates presidential villa in Yadadri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News