Thursday, January 23, 2025

బ్రాహ్మణుల కోసం ప్రత్యేక పథకం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లిలో నిర్మించిన ‘విప్ర‌హిత’ బ్రాహ్మ‌ణ సంక్షేమ‌ స‌ద‌నాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం ప్ర‌సంగించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి మా ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం తీసుకోస్తున్నట్లు సిఎం తెలిపారు. బ్రాహ్మణ సదనాన్ని రూ. 12 కోట్లతో నిర్మించామని ఆయన వెల్లడించారు. వేదశాస్త్ర విజ్ఞాన భాండారారంగా బ్రాహ్మణ సదన్ విలసిల్లాలని కెసిఆర్ పేర్కొన్నారు. వేదపండితుల భృతిని రూ. 2500 నుంచి రూ. 5 వేలకు పెంచామన్నారు. ధూప, దీప, నైవేద్యాల పథకం కింద ఇచ్చే నిధి రూ. 10 వేలకు పెంచామని తెలిపారు.

గౌరవ భృతి అర్హత వయసు 75 నుంచి రూ. 65 ఏళ్లకు తగ్గించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ కె. వి. రమణాచారి, సిఎస్ శాంతి కుమారి, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News