Wednesday, January 22, 2025

ఢిల్లీలో బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని పరిశీలించిన కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

రేపు ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్(భారత రాష్ట్ర సమితి) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ మధ్యాహ్నం సందర్శించారు. కార్యాలయాన్ని పరిశీలించిన ఆయన…ఈ సందర్భఁగా పలు సూచనలు చేశారు. అనంతరం యాగం, పూజలు జరుగుతున్న ప్రదేశాలను సందర్శించారు. తదనంతరం
సర్దార్ పటేల్ మార్గ్ నుంచి వసంత్ విహార్‌కు వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న బిఆర్‌ఎస్ శాశ్వత భవనాన్ని ఆయన పరిశీలించారు. అన్ని ఫ్లోర్లను కలియ తిరిగి పలు సూచనలు చేశారు.

సిఎం కెసిఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, సంతోష్ కుమార్, పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఉన్నారు. కాగా.. ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా హాజరు కానున్నారు. అలాగే యుపిమాజీ సిఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News