Monday, January 20, 2025

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సిఎం కెసిఆర్ : ఎమ్మెల్యే కృష్ణారావు

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్రంలోని బడుగు, బలహీన వ ర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల బిసి బందు పధకానికి దరఖాస్తు చేసుకున్న కూకట్‌పల్లి నియోజకవర్గంకు చెందిన సుమారు 40 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను శనివారం శేషాద్రినగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని పధకాలను రూపొందించి అమలు చేస్తూ అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తున్న కెసిఆర్ సే వలు దేశ ప్రజలు కోరుతున్నారన్నారు. ప్రత్యేక పదకాలు పేదలు అందుకుని లబ్ధి పొందుతూ అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతీ ఒ్కకరూ ప్రభుత్వ పధకాలను వినియోగించుకుని లబ్ధి పొందాలని కృష్ణారావు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దం నర్సింహ్మా యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్, సబిహాగౌసుద్దీన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News