Monday, January 20, 2025

దళిత బాంధవుడు సీఎం కేసీఆర్

- Advertisement -
- Advertisement -

తిమ్మాపూర్: దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అని బీఆర్‌ఎస్ ఎస్సీసెల్ నాయకులు పేర్కొన్నారు. దళిత జాతి అభ్యున్నతికి కృషి చేస్తున్న గొప్ప వ్యక్తిఅని కొనియాడారు. ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు కొయ్యడ మురళి, నాయకులు మేడి అంజయ్య, వంతడ్పుల సంపత్, వడ్లూరి శంకర్, మాతంగి లక్ష్మణ్ మండల కేంద్రంలో సమావేశమై మాట్లాడారు. దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున డా. బీఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పారని అన్నారు.

దళితుల అభివృద్ధికి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, ఎంతోమంది కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన మహానీయుడని కొనియాడారు. మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రసమయి ఎంతో కృషి చేస్తున్నారనీ, అలాంటి నాయకుడిపై కాంగ్రెస్ నాయకులు పనికిరాని ఆరోపణలు విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పి దళితుల ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే పెంచుతున్నారని పేర్కొన్నారు.

మండలంలోని రాంహనుమాన్ నగర్ గ్రామంలోని దళితులకు దళితబంధు అందజేశారనీ, నియోజకవర్గంలోని మరో 1100మందికి అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రసమయిపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామనీ, ఇలాంటివి పునరావృతమైతే కాంగ్రెస్ నాయకులకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

నాయకులు పారునంది జలపతి, నగునూరి బాబు, కవ్వంపల్లి అంజి, గంగిపల్లి సంపత్, బోయిని తిరుపతి, దుర్గం అశోక్, కిన్నెర అంజి, తాళ్లపల్లి నందకిశోర్, గాజ సాగర్, రొడ్డ రమేశ్, తూర్పాటి అజయ్, అలువాల సంపత్, గోదరి రాజమల్లయ్య, కనకయ్య, కామెర ప్రభాకర్, దప్పు తిరుపతి, సముద్రాల మల్లేశ్, ఎనగందుల నరేశ్, సతీశ్, ఆసంపల్లి అశోక్, దుర్గం అభిషేక్ వారి వెంట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News