Monday, November 18, 2024

రాజకీయ చదరంగ మేధావి సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోదావరి ని ఒడిసి..పట్టి, యాడికి పోతవు ముందుగా..మా మాగాణి ని దాహం తీర్చు అని అపర భగీరథుడి లా ఎక్కడ చూసినా జల గల గల లు ప్రకృతి కి వినిపించే లా చేసిన సస్యశ్యామల కృతి ఉత్సవం ను తెలంగాణ గాలి, ధూళి వీక్షించి..పండుగ చేసుకుంటుంది.తెలంగాణ ను సాధించటం ఓ ఎత్తు ఐతే..సాధించిన తెలంగాణ ను .. వాహ్..తెలంగాణ అని దేశ వ్యాప్తంగా ఆబ్బురపడెట్టు చేయడం మరో ఎత్తు. రాజకీయాల్లో ఎత్తులు ,పై ఎత్తులు సహజం కానీ వాటిని కూడా తన ఖలేజా తో.. షాన్ దార్ కే సీ ఆర్ అనేలా చేసిన రాజకీయ చదరంగ మేధావి సిఎం కెసిఆర్. చదరంగం ఆడటం నాకు రాదు. చెస్ ఆడటం ఓ ఆట గానే గాక కళ అని భావిస్తా.. మైండ్ గేమ్ గా అభివర్ణించే చెస్ ను నేర్చుకోవాలని, నేర్పరా ప్లీజ్ అని ఆ ఆట వచ్చిన వాళ్ళాను పలు మార్లు ప్రాధేయపడ్డాను.

ఐనా ఆ కోరిక ఇప్పటికీ తీరలేదు.ఈ నా కుతూహలం గురించి ఎందుకు చెప్పానంటే.. రాజకీయాలు సైతం ఎంతో ఆసక్తి దాయకంగా ఉంటాయి. ఎన్నో,ఎన్నో విషయాలను అనుభవం తో ఆకలిoపు చేసుకున్న వ్యక్తులు రాజకీయం చేయడానికి ఆచి తూచి అడుగులు వేస్తుంటారు.వాళ్లు అలా ఆచి తూచి అడుగులు వేస్తుంటే..ఎన్నో ట్విస్టులు ఉన్న సినిమా కథ కంటే కూడా రసవత్తరంగా ఉంటుంది. చదరంగం లో ఎలా ఐతే ఎత్తులకు పై ఎత్తులు వేస్తారో,ప్రత్యర్థి వేసే ఎత్తులకు.. పై ఎత్తులు ఎలా వేయాలో ముందుగానే అవగతమై ఉండాల్సిన ఆట చదరంగం.అట్టాంటి చదరంగం ను మించిన చతురత తో అడే చదరంగం ఆట గా తెలంగాణ రాజకీయాలను మలిచారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.ఈ ఎత్తులు జిత్తులు మరెవ్వరికీ “రావు” ఆన్న బిరుదును సహజంగానే అలంకరించిన రాజకీయ చతురులు కెసిఆర్. ఇపుడు ఇలా.. ఈ చదరంగానికి, తెలంగాణ రాజకీయాలను కెసిఆర్”తీర్చి దిద్దిన” తీరు ను పోల్చి ఈ వ్యాసం రాయడానికి ప్రధాన కారణం..

నేను ఈ రెండు,మూడు రోజుల నుంచి పలువురు వ్యక్తులను కలిస్తే..మిస్టర్ “మాచన” కర్ణాటకం చూశాం కదా, వాట్ నెక్స్ట్ అబౌట్ తెలంగాణ అని ఏదో కూసింత ఆసక్తి తో అడిగారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉన్న వాతావరణం బట్టి సాయంత్రం లేదా రాత్రి వర్షం పడుతుందా లేదా చెప్పొచ్చు కానీ తెలంగాణ రాజకీయాల పై అంత సులువుగా వ్యాఖ్య చేయలేమని చెప్పా.. ఒకప్పటి రాజకీయాలు వేరు ప్రస్తుత రాజకీయాలు వేరు. మా కుటుంబం కూడా రాజకీయాలను చూసిన , నాయకత్వం నెరిపిన నేపథ్యమే ఉంది.అందుకే ఇంటర్ నుంచే మా ఊరు మేడ్చల్ జిల్లా కేశవరం పై అలా ఓ కన్ను వేసి పెడతా.సేవా రాజకీయాలు ,రాజకీయ సేవ తెలిసిన నా నాలుగు పదులు దాటిన జీవితం లో తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే.. పాలిటిక్స్ అనే తాళం కు మాస్టర్ “కీ” తయారు చేసిన ఘనత తెలంగాణ కే దక్కుతుందని అన్పిస్తోంది.

అటు ద బెస్ట్ లీడర్ షిప్ తో పాటు.. రాజకీయాల పై ఏకంగా తన దైన ముద్ర వేసుకున్న శిల్పి కెసిఆర్ అనక తప్పదు.”సార్”.. ఆలోచన శైలి,రాజకీయ చతురత ఆన్న అంశం పై పరిశోధన చేసి డాక్టరేట్ కొట్టొచ్చు. జాతీయ స్థాయిలో “తెలంగాణ” ప్రాభవాన్ని తీసుకెళ్లాలి ఆన్న ఆలోచన ఐతే నేమి..అందునా బీ ఆర్ ఎస్ కు ఇతర రాష్ట్రాల నాయకులు దారి వెసేలా..మీకు నేనున్నా ఆన్న భరోసా ఇస్తూ..చక్కటి రథ సారధ్యం చేస్తున్నారు. కారు కు చక్కటి దారి లో వెల్లేలా స్టీ”రింగ్” తిప్పుతున్నారు. చదరంగం ఆడటానికి నేర్పు,యుక్తి,మేధస్సు ఎంత అవసరమో.. రాజకీయలకు కే సీ ఆర్ మార్క్ ను ట్రెండ్ మార్క్ గా బ్యూటిఫై చేశారు.కే సీ ఆర్ హయాం లో రాజకీయాలను పరికించిన వారికీ, పాలిటిక్స్ లో ఉన్న వారికి ట్రిక్స్ ఇలా ఉంటాయి అని పాఠాలు నేర్చుకునే పాఠశాల లా ..రాజకీయ అవగాహన కలిగించారు కే సీ ఆర్. క్యా సొంచ్ తా.. క్తా కర్తా..ఆన్న విషయాలను ఎవరికి అంత సులువుగా తట్టకుండా ఎప్పటికప్పుడు ఏమరుపాటు తో ఉండి పావులు కదుపుతున్నారు ఆన్న భావన పొలిటీషియన్ కు అర్థం అయ్యేలా చేశారు. దటీజ్ కెసిఆర్. అని నిరూపిస్తున్నారు. ఖేలెంగే క్యా.. ఆవో అని సవాల్ విసురుతున్నారు

మాచన రఘునందన్
9441252121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News