Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడు

- Advertisement -
- Advertisement -

దుబ్బాక: సిఎం కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడు కాబట్టే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నియోజక వర్గమైన దుబ్బాక పట్టణంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సురక్ష దినోత్సవం ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ విజన్ ఉన్న గోప్ప నాయకుడు కాబట్టే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ సాదించిన తర్వాత సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు అర్ధమయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు.

గత ప్రభుత్వాల కాలంలో పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లాలంటే భయపడే వారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఏర్పడి నాటి నుంచి ప్రజలకు ఆటువంటి భయాందోళన అవసరం లేకుండా పోయిందన్నారు. ప్రతిఒక్కరూ పోలీస్ వ్యవస్ధను గౌరవించాలన్నారు. దేశంలో వాడుతున్న టెక్నాలజీ తరహాలో రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణ కోసం ఇవ్వాళ్ల కమాండ్ కంట్రోలును హైదరాబాద్‌లో నిర్మించుకున్నామని తెలిపారు. అలాగే శాటిలైట్ టెక్నాలజీతో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాలు తెలుసుకుంటున్నారంటే అది మన రాష్ట్ర ప్రభుత్వఘనతనే అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న నాయకుడుసిఎం కెసిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక సిఐ మున్నూరు కృష్ణ, ఎస్‌ఐ బత్తుల మహేందర్ పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News