మరిపెడ: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సిఎం కెసిఆర్ విజన్‌తో ముందుకు వెళ్తున్నారని, సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ముందు చూపు, అద్భుతమైన ఆచరణతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని, అందులో భాగంగా మరిపెడ పట్టణ శర వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామలు కావాలని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఆడిటోరియంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నేతృత్వంలో పట్టణ ప్రగతి దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటేలా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా బతుకమ్మ బోనాలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లు, డాన్స్‌లు, నృత్యాల మధ్య ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు ఘన స్వాగతం పలికారు.
ఉదయం కార్గిల్ సెంటర్ నుంచి ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ అని, ఏ రాష్ట్రంలో జరగని పట్టణాభివృద్ధి తెలంగాణలో జరిగిందని, పట్టణా మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని దశల వారిగా చేపట్టి పట్టణాలను సర్వాంగ సుదందరంగా తీర్చిద్దడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందన్నారు. స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి భారీ నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడంతో దేశానికే ఆదర్శంగా మన పట్టణాలు నిలుస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పట్టణ ప్రగతిని ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో పట్టణాల రూపురేఖలు మారాయిని తెలిపారు. మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న మరిపెడను మున్సిపాలిటీగా ఎంపిక చేసి రూ. 20 కోట్లు మంజూరి చేయడం జరిగిందన్నారు.
ఇట్టి నిధులతో పట్టణంలో సిసి రోడ్డు, డ్రైనేజీ వ్యవస్ధ, ఆడిటోరియం, మోడల్ మార్కెట్, ట్యాంక్ బండ్, వైకుంఠధామం, ఆటోలు, ట్రాక్టర్, సెంటర్ లైటింగ్, హైమాస్ లైట్స్, డివైడర్, పార్క్ తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇటివల సిఎం కెసిఆర జిల్లా పర్యటనలో మరో రూ. 25 కోట్లు మంజూరు చేశారని ఇటి నిధులతో మున్సిపాలిటీ కార్యాలయ భవనం, కూన్యతండా రోడ్డు వెడల్పు, మాకుల చెరువు ట్యాంక్ బండ్, రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు, అన్ని వార్డుల్లో సిసి రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. మరిపెడ మున్సిపాలిటీ దినదిన అభివృద్ధి చెందుతుందని ఈ అభివృద్ధి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఉత్తమ సేవలకు గానూ కౌన్సిలర్లు, పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ అధికారులు, స్ట్రీట్ వెండర్, బ్యాంకర్ తదితరులకు ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం సహపక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, కమిషనర్ ఏ. రాజు, ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు కుడితి మహేందర్‌రెడ్డి, గుగులోతు వెంకన్న, తహశీల్ధార్ పిల్లి రాంప్రసాద్, ఎంపిడిఓ కేలోతు ధన్‌సింగ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారుల, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.