Thursday, January 23, 2025

సీఎం కేసీఆర్ మహిళ పక్షపాతి

- Advertisement -
- Advertisement -
  • తొమ్మిదేళ్ళల్లో రాష్ట్రంలో తగ్గిన మాతాశిశు మరణాలు
  • మహిళా ఆర్థికస్వాలంభనతోనే రాష్ట్రాభివృద్ధి
  • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమ ంత్రి కెసిఆర్ మహిళాల పక్షపాతి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం సమీపంలో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి జ్యోతిపద్మ అధ్యక్షతన నిర్వహించిన మహిళ దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో మహిళలకు సంబంధించిన పథకాలు అ గ్రభాగంలో ఉన్నాయన్నారు. మహిళల ఆర్థికస్వాలంభనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమౌతుందున్నారు.

ప్రతీ ఇంట్లో మహిళల పాత్ర కీల కం అన్నారు. ఏ ఇంట్లో మహిళలు ఆర్థిక పొదుపు పాటిస్తారో అది ఆ కుటుంబానికి బలమైన పునాదిని ఏర్పాటు చేస్తుందన్నారు. తొమ్మిదేళ్ళ పాలనలో మహిళా సాధికారతకు గట్టి పునాదులు వేసి వేసి సీ ఎం కేసీఆర్ మహిళ పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో మాతా, శిశుమరణాలు భారీగా తగ్గాయన్నారు. లింగనిర్ధారణపై సంపూర్ణ నిషేదం ప్రకటిండంతో పాటు పీడీ యాక్ట్ కేసులు నమోదుతో కట్టడి చేసినట్లు పేర్కొన్నారు. షీటీం మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారిలో మానసిక ధైర్యాన్ని నింపడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రా ష్ట్రంలో మొట్టమొదటి సారిగా పోలీస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌తో పాటు రాజకీయాల్లో రాణించేలా మార్కెట్ కమిటీ నియామకాల్లో రి జర్వేషన్ కల్పించిన మహానేత సీఎం కేసీఆర్ అన్నారు.

పురుషులే అత్యంత కష్టంగా భావించే విద్యుత్ శాఖలో కరెంటు స్తంబాలు ఎక్కి విధులు నిర్వహించే లైన్ మెన్ ఉద్యోగాల్లో ౩౦౦ మందికి నియమించినట్లు గుర్తు చేశారు. 2014/2018 ఎన్నికల్లో మహిళల ఆశీర్వాదంతోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిందని అందుకే కేసీఆర్ వారందరికి సమూచిమైన సంక్షేమం, అవకాశాలను కల్పిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరోగ్య లక్ష్మీ పథకంతో 20. 72 లక్షల మంది గర్బిణీలు, 18.42 మంది బాలింతలు, 97.49 మంది 7 సంవత్సరాల నుండి మూడెళ్ల చిన్నారులు లబ్ధిపొందుతున్నారన్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌లుగా విధులు నిర్వహిస్తున్న 149 మందిని క్రమబద్దీకరించడంతో పాటు అంగన్‌వాడీ సిబ్బందికి 300శాతం గౌరవ వేతనాన్నిపెంచారని గుర్తు చేశారు.

నియోజకవర్గ వ్యాప్తంగా 1725 మంది మహిళలకు ఒంటరి మహిళ పింఛన్లు, 14,735 మందికి వితంతు పించన్లు అందిస్తున్నట్లు తెలిపారు. అం తే కాకుండా కళ్యాణలక్ష్మీ, షాదిముబాకర్ పథకం ద్వారా ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా 10052 మందికి అందజేసినట్లు తెలిపా రు. మహిళ కోసం జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండు ఎకరాల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, బీఆర్‌బీ భవ నం, సఖి కేంద్రం, వృద్దాశ్రమం, ఇసీడీసీ భవనంతో పాటు బాల రక్ష భవన్‌ను త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముందుగా మహిళలు మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోనాలు, బతుకమ్మలతో దూమ్-దామ్ నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులు మామిడి అనిత, ధరావత్ కుమారి, పుష్ప, ఆకుల కవిత, మలోతు కమల, కుంభం రేణుక, జాటోతులక్ష్మీ, నిమ్మల శ్రవంతి, కొండపల్లి భద్రమ్మ, ధరావత్ నీలాబాయి, బత్తుల లక్ష్మీ, జ్యోతి శ్రీవిద్య, శిరీ, శారదతో పాటు మహిళలు భారీగా పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి, కలెక్టర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించిన మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకోని మహిళలకు రంగోలి, మ్యూ జికల్ చైర్స్, స్పీడ్ వాక్, లెమన్ స్పూన్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, కలెక్టర్ ఎస్ వెంకట్రావులు బహుమతులు ప్రదా నం చేశారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 23 మంది మహిళా ఉద్యోగులు, అధికారులకు సన్మానం చేసి ప్రశంశ పత్రాలను అందజేశారు. అనంతరం గర్భీణిస్త్రీలకు శ్రీమంతం చేసి, పిల్లలచే అక్షరాభ్యాసం చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News