పెనుబల్లి : కెసిఆర్ ప్రభుత్వం కూలీల పక్షపాతిగా, కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ప్రతి ఏడాది ఉపాధి హామీ కూలీలను కలుసుకునే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెనుబల్లి మండలంలోని లంకపల్లి, గురవాయిగూడెం, శ్రీనివాసపురం, కొండ్రుపాడు, పెనుబల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను స్వయంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య వెళ్లి కలుసుకొని రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్‌లను, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఉపాధి హామీ కూలీలకు వేడి నీరు, చల్లటి నీరు సమస్థితిలో ఉంచగల కూలీలకు ఎంతగానో ఉపయోగపడే స్టేన్లెస్ స్టీల్ బాటిల్స్ ను, వేసవి కాలం దృష్ట్య మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు, నియోజకవర్గ వ్యాప్తంగా పంపిణి కార్యక్రమాన్ని చేపట్టగా, నేడు పెనుబల్లి మండలంలో గ్రామాల్లో ఆయా గ్రామ నాయకులు పంపిణి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంపై కేంద్ర వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న స్పష్టతని కూలీలకు వివరించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్షం చేసినప్పటికీ, పెద్దగా పట్టించుకోనప్పటికీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచినస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూలీల సంక్షేమం కోరకు పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి నాయకులు కోటగిరి సుధాకర్, ఎంపిటిసి చీపి లక్ష్మీకాంతం, స్థానిక సర్పంచ్ తేజావత్ తావూ నాయక్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట్రావు, మల్లెల సతీష్ తదితరులు పాల్గొన్నారు.