Thursday, January 23, 2025

రైతుల పక్షపాతి సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమేష్

మంచాల: రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కెసిఆర్ అని బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బిఆర్‌ఎస్ కార్యాలయంలో ఎంపిపి జాటోత్ నర్మద, పిఎసిఎస్ చైర్మన్ పుల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత్ బహదూర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దండేటికార్ రవి తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నుముక అన్నారు.

అన్నదాతలు అహర్నిశలు కష్టపడి దేశానికి అన్నం పెడుతున్నట్లు తెలిపారు. మంచాల మండలంలో 17,467 మందికి రూ.17కోట్లు రైతుబంధు అందిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి అనేక పథకాలు అందజేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, బిఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరక్టర్ ఎండి జానీపాషా, రైతు సంఘం జిల్లా సభ్యులు పల్లె జంగారెడ్డి, నాయకులు జంబుల కిషన్ రెడ్డి, చిందం రఘుపతి, కందాళ శ్రీశైలం, దండేటికార్ సత్యనారాయణ, బెల్లి గోపాల్, నోముల సర్పంచ్ పల్లాటి బాల్ రాజు, లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News