- Advertisement -
- హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
- భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ
హుస్నాబాద్: ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని 17వ వార్డులో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న భవన నిర్మాణ కార్మిక తాపీ సంఘం భవనానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మిక, కర్షక, సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అనిత, వార్డ్ కౌన్సిలర్ వల్లపు రాజు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -