Wednesday, January 22, 2025

తెలంగాణ సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -
  • ఎంఎల్‌ఎ అంజయ్య యాదవ్

షాద్‌నగర్: తెలంగాణ సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద పీఠ వేశారని, దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో కొనసాగుతున్నాయని షాద్‌నగర్ ఎంఎల్‌ఎ వై.అం జయ్యయావవ్ వివరించారు. సోమవారం పట్టణంలోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో గిరిజన కళాకారుడు సింగర్ మురళి రచించిన పాటను అంజయ్య యాదవ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ వై.అంజయ్య యాదవ్ మాట్లాడుతూ తనపై సొంతంగా పాట రాయడం ఎంతో సంతోషంగా ఉందని, ఎవరు రా అంజన్నను కాదనేవారు అంటూ సాగే ఈగీతం ఎంఎల్ ఎతోపాటు వారి అభిమానులను, బిఆర్‌ఎస్ శ్రేణులను ఎంతగానో సంతోషాన్ని కలిగించిందని వివరించారు. స్థానిక శాసన సభ్యుడు వై.అంజయ్య యాదవ్‌పై సింగర్ మురళి పాట రాయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పివైస్ చైర్మెన్ ఈట గణేష్, కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్, ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, ఎస్సీ, ఎస్టి కమీషన్ మాజీ సభ్యుడు రాంబల్‌నాయక్, నేతలు శ్రావణ్‌కుమార్, వీరేష్, రాజునాయక్, లక్ష్మీనారాయణ గౌడ్, బాలునాయక్, అగ్గనూరి విశ్వం, హన్యానాయక్, రఘుమారెడ్డి, శేఖరప్పలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News