Wednesday, January 22, 2025

పాలన సులభతరం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు త్వరితగతిన ప్రజలకు అందించేందుకు పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్న జి ల్లాలు, చిన్న మండలాలుగా ఉంటే అధికార యం త్రాంగం ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉం టుందని ఎమ్మెల్సీ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో పెద్ద మండలంలో ఉన్న మాడుగుల మండలంలోని ఇర్విన్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సిఎం కెసిఆర్‌కు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. మండలానికి ఉండాల్సిన అ న్ని వసతులు, సౌకర్యాలు ఉన్నాయని ఆయన అన్నారు.

ఇర్విన్ గ్రామానికి 12 వేల ఎకరాల భూ మి ఉందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. రై తులకు సబ్ స్టేషన్, ప్రాథమిక వైద్యశాల, ఉన్నత పాఠశాల తదితర వసతులు మండల ప్రజలకు అం దుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. ఇర్విన్‌ను మండలంగా ఏర్పాటు చేయడంతో ఎంతో కా లంగా ఎదురు చూస్తున్న గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చై ర్మన్ ఎడ్మ సత్యం, వైస్ ఎంపిపి గోవర్ధన్, పిఎసిఎస్ డైరెక్టర్ బన్నె శ్రీనివాస్ యాదవ్, కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బన్నె శ్రీనివాస్ యాదవ్, కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్మల శ్రీకాంత్, నాయకులు శ్రీధర్ యాదవ్, మాడుగుల మండల నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News