Wednesday, January 22, 2025

తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి రూరల్: తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని వరంగల్ జడ్పి చైర్‌పర్సన్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శాయంపేట మండలం సూర్యనాయక్ తండా గ్రామంలో నిర్వహిస్తున్న గిరిజన దినోత్సవ కార్యక్రమం ముఖ్య అతిధిగా వరంగల్ జడ్పి చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి తండాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తండాలను గూడాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనుల చిరకాలవాంఛ తీరుస్తూ పంచాయతీ హోదా కల్పించారన్నారు. విద్యలో, ఉద్యోగాలలో గిరిజనులు వెనుకబాటులో ఉండరాదని గిరిజన బిడ్డలకు ఎస్‌టి రిజర్వేషన్ 10 శాతం పెంచి గిరిజనుల బతుకుల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపారన్నారు.

గిరిజనుల ఆత్మగౌరవ ప్రతికగా రూ.45కోట్లతో హైదరాబాద నడిబొడ్డున సంత్ సేవాలాల్, కొమురం భీం భవనాలను గిరిజనుల కోసం నిర్మించడం జరిగిందన్నారు. గిరిజనులు, ఆదివాసులు ఆరాధ్యంగా భావించే సంత్ సేవాలాల్, నాగోబా మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

అదే విధంగా శాయంపేట ప్రాథమి ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న న్యూట్రిషన్ కిట్లను 29 మందికి గర్భిణీ స్త్రీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కృష్ణమూర్తి, ఎంపిపి మెతుకు తిరుపతిరెడ్డి, వైస్ ఎంపిపి రాంశెట్టి లత లకా్ష్మరెడ్డి, గ్రామ ప్రజలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఆశా వర్కర్లు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News