Saturday, December 28, 2024

ప్రతి ఇంటికి మంచినీటిని అందించిన ఘనత సిఎం కెసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి రూరల్: ప్రతి ఇంటికి మంచినీటిని అందించిన మహర్షి ముఖ్యమంత్రి కెసిఆర్ అని మొగుళ్లపల్లి ఎంపిపి సుజాత, జడ్పిటిసి జోరుగ సదయ్యలు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మొగుళ్లపల్లి సర్పంచ్ మోటె ధర్మారావు ఆధ్వర్యంలో మంచినీళ్ల పండగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొగుళ్ళపల్లి జడ్పిటిసి జోరుగ సదయ్య, ఎంపిపి యార సుజాత సంజీవరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిపి, జడ్పిటిసిలు మాట్లాడుతూ ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ నీటినందించిన మహర్షి సిఎం కెసిఆర్ అని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణతో ప్రకృతి నియమాలకు అనుగుణంగా రాష్ట్రం మొత్తం ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని కంకణ బద్దుడై కార్యదీక్షతో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచి నీరునందించిన మహర్షి ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

మిషన్ భగీరథ మంచినీళ్ల రాకతో ఎన్నో ఏళ్లుగా ఆడబిడ్డలు పడ్డ నీటి కష్టాలు కంటికి కూడా కానరాకుండా పోయాయన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మిషన్ భగీరథ ఏఈ, పంచాయతీ కార్యదర్శులు, బిఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News