Wednesday, January 22, 2025

ఇంటింటికి నీటిని అందించిన ఘనత సిఎం కెసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -

మద్నూర్: మనిషికి స్వచ్ఛమైన గాలి, ఆహారంతో పాటు మంచినీరు ఎంతో అవసరమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సిఎం కెసిఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్చమైన తాగునీటిని అందించారని జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మద్నూర్ మండలంలోని శేఖాపూర్ గ్రామంలో నిర్వహించిన తెలంగాణ మంచినీటి దినోత్సవ సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత 9 ఏండ్లలో జరిగిన ప్రగతిని దశాబ్ది ఉత్సవాల ద్వారా గ్రామ గ్రామాన వివరిస్తున్నామన్నారు. సంక్షేమ, అభివృద్ధ్ది రంగాలలో యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధ్దికి అహర్నిశలు కృషి చేస్తున్నానని, సిఎం కెసిఆర్ సహాయ, సహకారాలతో గ్రామాల్లో మౌళిక సదుపాయాలు, అభివృద్దికి కోట్లాది అభివృద్ధి చేశామన్నారు. గత 60 ఏండ్లలో జరుగని అభివృద్ధ్ది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 9 ఏండ్లలో జరిగిందన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. యావత్ దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందజేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, ప్రజలు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News