Thursday, January 23, 2025

తాగునీటి గోస తీర్చిన ఘనత సిఎం కెసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల : తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందించి తాగునీటి సమస్యకు ముఖ్యమంత్రి కెసిఆర్ శాశ్వత పరిష్కారం చూపించారని ఎమ్మెల్యే డా. లకా్ష్మరెడ్డి తెలిపారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాల్టీ కేంద్రంలోని పందిరిగుట్ట వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన నీళ్ల పండుగ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2014కు ముందు జడ్చర్ల పట్టణ, గ్రామాల్లో ప్రజలు తాగునీటికి చాలా తిప్పలు పడ్డారని, నీళ్ల ట్యాంకర్ల వద్ద ఆడబిడ్డలు కొట్లాడుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ దుస్థితి లేదని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో మిషన్ భగీరథ పథకం ద్వారా నేడు ప్రతి ఇంటికి తాగునీళ్లు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి పంచాయతీకి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మించి తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. అంతకు ముందు నిమ్మబావిగడ్డ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద నూతనంగా డిఎంఎల్‌డి వాటర్ పైప్‌లైన్ గేట్ వాల్ తిప్పి ప్రారంభించారు. దీని వల్ల ప్రతి రోజు పట్టణానికి సరఫరా అయ్యే 7 ఎంఎల్‌డి వాటర్‌కు అదనంగా 3ఎంఎల్‌డి వాటర్ సరఫరా కానున్నదని తెలిపారు. అనంతరం మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిసిసి చైర్మన్ వాల్యానాయక్, జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, డిసిఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ సుదర్శన్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కాటేమోని శంకర్ , ఉమాశంకర్ గౌడ్ , రమేష్ , మాజీ సర్పంచ్ రేణుక, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పిట్టల మురళి, రాంమోహన్, నాగిరెడ్డి, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News